ఏపీలో రాజకీయాలను నిశితంగా గమనిస్తున్న ఓ మాజీ అధికారి తన ఆవేదనను మీడియాతో పంచుకున్నారు. విభజన తరువాత పరిస్తితులను కూడా ఆయన జాగ్రత్తగా గమనిచినవి చెప్పుకువచ్చారు. పదమూడు జిల్లాల ప్రగతి ఎలా ఉందో, ప్రత్యేకించి విశాఖ ఎలా ఉందో ఆయన తన మాటల్లోనే వివరించారు.


ఏపీలో టీడీపీ సర్కార్ మళ్ళీ అధికారంలోకి వస్తే ఏపీతో సహా  విశాఖను మొత్తానిని మొత్తం ఊడ్చి పారేస్తారని యూపీఎస్సీ మాజీ ఇన్‌చార్జ్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కేఎస్‌ చలం అభిప్రాయపడ్డారు. విశాఖకు హుదూద్ తుపాన్ చేసిన ప్రమాదం చాలా తక్కువని భూ బకాసురులే ఎక్కువ హాని చేసి  వేల కోట్ల భూములు కొల్లగొట్టారని ఆయన అన్నారు. విశాఖను అన్ని విధాలుగా దోచుకున్నారని ఆయన విమర్శించారు. విభజన తరువాత ఏపీలో పెద్ద నగరం కావడంతో దోపిడీదారుల కన్ను ఇటువైపు పడిందని చెప్పుకొచ్చారు. విశాఖను అన్ని విధాలుగా నాశనం చేశారు తప్ప అభివ్రుధ్ధి ఏమీ చేయలేకపోయారని ఆయన అన్నారు.


చంద్రబాబు అయిదేళ్ల పాలన పూర్తిగా అభివ్రుధ్ధి నిరోధకంగా సాగిందని, జన్మభూమి కమిటీలను పార్టీ కోసం వాడుకుని మొత్తం రాజకీయం చేశారని ఆయన అన్నారు.  పెరిగింది ఏపీ అభివ్రుధ్ధి రేటు కాదని, అమరావతిలో రియల్ ఎస్టేట్ భూముల రేటు అని ఆయన విమర్శించారు. దాన్నీ రెండంకెల అభివ్రుధ్ధిగా చూపుతున్నారని చెప్పారు. విశాఖ భూ దందాలు చేసిన వారే ఆ డబ్బులను ఇపుడు ఎన్నికల్లో ఖర్చు చేసి మళ్ళీ గెలవాలనుకుంటున్నారని ఆయన హాట్ కామెంట్స్ చేశారు ఐటీని కనిపెట్టామని చెప్పుకున్న వారే డేటా చోరీ చేశారని, తన ఓటు కూడా చోరీ చేశారని కేఎస్‌ చలం అన్నారు. .  కాగా, విశాఖను రెండవ రాజధానిగా ప్రకటించి హై కోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: