విశాఖ జిల్లా అంటే వలసదారులకు అడ్డా అన్నది తెలిసిందే కానీ. ఎపుడు అవే రిజల్ట్స్ రిపీట్ అవుతాయనుకున్న పొరపాటే. చాలాసార్లు వలస నేతలు గెలిచారు. కొన్నిసార్లు ఓడిపోయారు కూడా. ప్రధానంగా ఎమ్మెల్యే సీటు విషయంలో ఎక్కువగా సామాజిక వర్గాలు, నాన్ లోకల్ అంశాలు బాగా ప్రాధాన్యత కలిగి ఉంటాయి.


గాజువాకలో పోటీకి దిగిన జనసేనాని పవన్ కళ్యాణ్ గెలుపు కాట్ వాక్ ఐతే కాదని అంటున్నారు. అక్కడ కాపుల ఓట్లు ఎక్కువగా ఉన్నాయని పవన్ బరిలోకి దిగారు. అయితే ఇక్కడ కాపులతో పాటు యాదవులు కూడా బలంగా ఉన్నారు. దాదాపుగా రెండు కులాలు సమానంగానే అని చెప్పాలి. అంతే కాదు బీసీలు కూడా ఎక్కువే. ఇది పారిశ్రామిక వాడ. కార్మికులు బాగా ఉంటారు. ఇక్కడ తమ సమస్యలను నిత్యం చూసే లోకల్ ఎమ్మెల్యేగా ఉండాలని భావిస్తారు. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ యాదవ సామాజికవర్గం. పైగా కార్మిక నేత పల్లా సిమ్హాచలం కుమారుడు. దాంతో కార్మికుల ఓట్లు ఆయన‌కే పడతాయి.


అదే విధంగా కాపులూ ఓట్లు గుత్తమొత్తంగా జనసేనకు పడతాయని చెప్పలేరు. ఇక్కడ ఉన్న సమస్యలు తెలిసిన వారికే ఓటు చేస్తామని ప్రజలు చెబుతున్నారు ఇక వైసీపీ తరఫున పోటీ చేస్తున్న తిప్పల నాగిరెడ్డి కూడా మంచి నాయకుడే. అందువల్ల ట్రయాంగిల్ పోటీ ఇక్కడ జరుగుతుంది. పవన్ నామినేషన్ వేసేసి వెళ్ళిపొతే గెలిచేస్తామనుకుంటే పొరపాటేనని అంటున్నారు. ఆయన ఇక్కడే ఉంటానని జనాన్ని నమ్మించగలిగితేనే విజయం సాధిస్తారని అంటున్నారు. చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: