క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే అదే అనుమానం మొదలైంది. హిందుపురం లోక్ సభలో టిడిపి తరపున సిట్టింగ్ ఎంపి నిమ్మల కిష్టప్ప పోటీ చేస్తున్నారు. అలాగే వైసిపి తరపున గోరంట్ల మాధవ్ రంగంలోకి దిగారు. ప్రభుత్వ ఉద్యోగైన మాధవ్ ను ఇపుడు ఇబ్బంది పెట్టాలని ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నారట. హిందుపురంలో టైట్ ఫైట్ తప్పదనే అందరూ అనుకుంటున్నారు.

 Image result for ycp loksabha hindupur candidate gorantla madhav

మొన్నటి వరకూ ఈ నియోజకవర్గంలో టిడిపికి ఎదురులేదు. తాజాగా టిడిపిని ఓడించేందుకు జగన్మోహన్ రెడ్డి వేసిన ప్లాన్ తో అధికార పార్టీలో మొదలైన ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నియోజకవర్గంలో బిసి సామాజికవర్గం ఓటర్లు చాలా ఎక్కువ. నిమ్మల కూడా బిసినే కావటంతో పాటు కాంగ్రెస్ లోని గ్రూపు రాజకీయాలు కూడా టిడిపికి కలసివస్తోంది. నియోజకవర్గంలో బాగా సర్వేలు చేయించుకున్న తర్వాత జగన్ కూడా ఇక్కడ బిసినే రంగంలోకి దింపాలని అనుకున్నారు.

 Image result for ycp loksabha hindupur candidate gorantla madhav

అటువంటి సమయంలో అనుకోని విధంగా పోలీసు అధికారి గోరంట్ల మాధవ్ వెలుగులోకి వచ్చారు. హిందుపుం లోక్ సభలో పోటీ విషయాన్ని మాట్లాడితే మాధవ్ కూడా సానుకూలంగా స్పందించారు. దాంతో హిందుపురం లోక సభలో మాధవే అభ్యర్ధిగా అప్పటికప్పుడు జగన్ ప్రకటించేశారు. పోటీపై సానుకూలంగా ఉన్న మాధవ్ కూడా తన పోలీసు ఉద్యోగానికి వెంటనే రాజీనామా చేసేశారు.

 Image result for ycp loksabha hindupur candidate gorantla madhav

మాధవ్ రాజీనామా చేసి రెండు నెలలవుతున్నా ప్రభుత్వం ఇంతవరకూ ఆమోదించలేదు. రాజీనామా ఆమోదం పొందకుండా మాధవ్ నామినేషన్ వేయలేరు అనేది ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తోంది. రాజీనామాను ఎందుకు ఆమోదించటం లేదంటే మాధవ్ అంటే అధికారపార్టీ భయపడుతోందట. ఎందుకంటే, మాధవ్ కు మంచిపేరుంది. పైగా పోలీసు అధికారి. అందులోను బిసిల్లోనే ఎక్కువ జనాభా ఉన్న కురబ ఉపకులానికి చెందిన వ్యక్తి.

 Image result for ycp loksabha hindupur candidate gorantla madhav

ఇంతకన్నా ఇంకేం కావాలి టిడిపి భయపడటానికి ? అసలే జగన్ ప్రభంజనం ఉందని ప్రచారం జరుగుతోంది. కాబట్టి హిందుపురంలో వైసిపి గెలుపు తథ్యం అని టిడిపి నేతలు ఆందోళన పడుతున్నట్లున్నారు. అందుకనే రాజీనామాను ఆమోదించకుండా ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని ఆలోచిస్తోంది ప్రభుత్వం. అయితే, రాజీనామాను ప్రభుత్వం ఆమోదించకపోతే కోర్టుకెళ్ళి ఉత్తర్వులు తెచ్చుకోవచ్చటలేండి. మాధవ్ ఇపుడాపనే చేస్తున్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: