ఆంధ్రప్రదేశ్ రాష్ట్రరాజకీయాల్లో కీలకమైన జిల్లా చిత్తూర్. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరియు చివరి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈ జిల్లాకు చెందిన వారే. దీనితో ప్రాధానత్య సంతరించుకుంది. ఇలా పొలిటికల్ బ్యాక్ గ్రాఫ్ బలంగా ఉన్న జిల్లా కేంద్రం నుంచి మహిళ నేత సత్యప్రభ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జిల్లా రాజకయాల్లో ముఖ్య పాత్ర పోషించిన రాజకీయ నేత ఆదికేశవులు మరణాంతరం సత్యప్రభ టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. సత్యప్రభ కు పోటీ గా వైసీపీ అభ్యర్థి జంగాలపల్లి శ్రీనివాసులు 6,799 ఓట్లతో ఓటమి పాలయ్యారు.


మరోసారి గెలుపుకోసం ఆమె ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నియోజకవర్గం 1955 లో ఏర్పడింది. అప్పటి నుండి ఇక్కడ 13 సార్లు ఎన్నికలు జరిగాయి. అయితే ఇందులో అత్యధికంగా కాంగ్రెస్ ఆరు సార్లు విజయం సాధించింది. టీడీపీ రెండుసార్లు గెలువగ ఇతర పార్టీలు, స్వతంత్రులు ఐదుసార్లు విజయం సాధించారు. మొదటి నుంచి ఈ నియోజకవర్గం కాంగ్రెసుకు మద్దతుగా  ఉంటుంది. ఈ నియోజకవర్గంలో 1996 నుంచి చిత్తూర్ పార్లమెంటు ను టీడీపీ కైవసం చేసుకుంటున్నా అసెంబ్లీని మాత్రం నెగ్గలేకపోతుంది. 2014 లో టీడీపీ ఇక్కడ తొలిసారి విజయం సాధించింది. ఆ తర్వాత గత ఎన్నికల్లో సత్యప్రభ టీడీపీ నుంచి పోటీ చేసి పసుపు జెండా ఎగురవేశారు. అయితే మరోవైపు చిత్తూర్ లో మంచి పట్టున్న వైసీపీ కూడా ఈసారి ఈ నియోజకవర్గాన్ని కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది.



గత ఎన్నికలలో కొత్తవారు నిలబడటం తో పోరు పెద్దగా ఆసక్తికరంగా మారలేదు. గత కొన్నేళ్లుగా పోటీకి దూరంగా ఉంటున్న సీ.కే.బాబు, ఏ.ఎస్.మనోహర్ పోటీకి దూరంగా ఉండటంతో కొత్తవారు తలపడ్డారు. అయితే ఈసారి పాత నాయకులు పోరుకు సిద్దం అవ్వడంతో కొంత ఆసక్తి నెలకొంది. ఇక్కడ అధికార, విపక్షాల రెండింటిలోనూ వర్గ రాజకీయాలు నష్టం తెస్తున్నాయి. ఈ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవాలని జనసేన భావిస్తూ ఉండటంతో ఇక్కడ పోరు రసవత్తరంగా సాగనుంది. ఈసారి బరిలో టీడీపీ నుంచి ఏ.ఎస్.మనోహర్ పోటీ చేయగ వైసీపీ నుంచి జంగాలపల్లి శ్రీనివాసులు పోటీలో దిగుతున్నారు. జనసేన అభ్యర్థి తెలియాల్సివుంది. మరి విజయం ఎవర్ని వరిస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: