రాష్ట్రంలోనే అత్యధిక మైనార్టీ ఓటర్లు ఉన్న నియోజకవర్గంగా కర్నూల్ కు ప్రత్యేకత ఉంది. అంతేకాక ఇక్కడి నుంచి నాలుగుసార్లు మైనార్టీ నేతలు ప్రాతినిధ్యం వహించారు. అయితే గత రెండు ఎన్నికల్లో మైనర్టియేతర అభ్యర్థులే విజయం సాధిస్తూ వచ్చారు.2009 లో కాంగ్రెస్ నుంచి టీ.జి. వెంకటేష్ విజయం సాధించారు. ఇక గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన ఎస్.వి.మోహన్ రెడ్డి తన ప్రత్యర్థి టీడీపీ నుంచి బరిలో నిలిచిన టీ.జి.వెంకటేష్ పై విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన టీడీపీ గూటికి చేరి మరోసారి గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.


ఈ నేపథ్యంలో కర్నూల్ రాజకీయాలు సర్వత్ర ఆసక్తిని రేపుతున్నాయి. కర్నూల్ నియోజకవర్గం 1955లో ఏర్పడింది. ఇప్పటివరకు 13 సార్లు ఎన్నికలు జరుగగా అత్యధికంగా కాంగ్రెస్ 7సార్లు , కమ్యనిస్టుపార్టీలు మరియు స్వతంత్ర అభ్యర్థులు రెండుసార్లు విజయం సాధించారు. ఇక టీడీపీ,వైసీపీ పార్టీలు చేరోకసారి విజయం సాధించాయి. కర్నూలులో వామపక్షాలకు ఇప్పటికీ మంచి పట్టుంది. 2009 లోనూ ఆ పార్టీ రెండో స్థానాన్ని దక్కించుకుంది. ముస్లింలు ఎక్కువగా ఉన్న ఈ సెగ్మెంట్లో తొలి ఎమ్మెల్యే కూడా ఆ సామాజిక వర్గానికి చెందినవారే. 1955 లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మొహమ్మద్ అలీఖాన్ ఇక్కడ తొలి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత మరో మూడుసార్లు మైనార్టీ వర్గం ఇక్కడ ప్రాతినిధ్యం వహించింది. దాదాపు 40% ఉన్న ముస్లింలే ఇక్కడ గెలుపోటములు శాసిస్తారు. గత ఎన్నికల్లో అత్యధిక సంఖ్యలో వైసీపీ ఎమ్మెల్యేలు విజయం సాధించారు.


కానీ అభివృధి పేరుతో ఎక్కువ మంది అధికార పార్టీలో చేరారు. వారిలో ఎస్వీ మోహన్ ఒకరు. అయితే ఎమ్మెల్యే పార్టీ మారిన క్యాడర్ మాత్రం ఆయనతో వెళ్ళలేదు. ఈ నేపథ్యలో ఎస్వీ విజయం నల్లేరు పై నడక కాదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే ఈసారి టీడీపీ పార్టీ నుంచి టీ.జి. వెంకటేష్ తనయుడు టీ.జి. భరత్ ను బరిలో దించుతున్నటు ఆ పార్టీ అధినేత తెలిపారు. అలాగే ఇటు వైపు వైసీపీ పార్టీ నుంచి ఈసారి మైనార్టీ అభ్యర్థి అయిన హఫీజ్ ఖాన్ ను పోటీ లో దించారు. మైనార్టీలు ఎక్కువుగా ఉన్న ప్రాంతం కావటంతో ఓట్లు చిలే అవకాశం ఉంది. ఇక జనసేన కూడా పోటీలో ఉంటే పోరు రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: