విజయనగరం జిల్లా రాజకీయేలే వేరుగా ఉంటాయి. ఇక్కడ పార్టీల కంటే కుటుంబాలే ముఖ్యం. ఇంకా చెప్పాలంటే వంశాల మధ్యన శతాబ్దాలుగా పోరు ఉంటుంది. కొన్ని దశాబ్దాలు వెనక్కు వెళ్తే ఎక్కడికక్కడ చిన్న రాజ్యాలను ఏర్పాటు చేసుకుని ఎవరికి వారు పాలించుకున్న చరిత్ర ఉంది. అలాంటి విజయనగరం రాజులంతా ఒక్కటయ్యారు.


అదీ తెలుగుదేశం పుణ్యమాని ఒకే చూరు కిందకు చేరారు. విజయన‌గరం రాజులకూ బొబ్బిలి రాజులకూ పడదు, అలాగే కురుపాం రాజులకూ, శత్రుచర్ల రాజులకూ పడదు, అయినా సరే అంతా ఒకే పార్టీలో వుంటున్నారు. ఓ విధంగా చెప్పాలంటే రాజులంతా ఒక వైపు, మిగతా వారు మరో వైపు అన్నట్లుగా జిల్లా రాజకీయాలను చంద్రబాబు విభజించేశారు. అదే ఇపుడు టీడీపీకి మైనస్ అవుతుందా అన్న కంగారు మొదలైంది.


ఈ రాజులు పేరుకు ఒక్కటిగా ఉన్నా వారి మధ్యన మనస్పర్ధలు ఉన్నాయి. వర్గ పోరు అలాగే పదిలంగా ఉంది. దాంతో వీరు బయటకు కలసినా ఒకరిని ఒకరు ఓడించుకుంటారా అన్న డౌట్లు కూడా ఉన్నాయి. అంతే కాదు. వీరంతా కలసినా దిగువస్థాయిలో క్యాడర్ ఇప్పటికీ కలవలేదు. దాంతో రాజుల కోటలో పాగా వేసేందుకు వైసీపీ ఇపుడు అన్ని రకాలైనా వ్యూహాలను వాడుకుంటోంది. దాంతో పాటు చేయాల్సినదంతా చేస్తోంది. 


ఈ పరిణామాలతోనే రాజులు ఇపుడు బేజారవుతున్నారు. ఒకే పార్టీలో చేరిన వీరంగా రేపటి ఎన్నికల్లో ఓడిపోతే రాజులు లేని రాజ్యమే అచ్చంగా వస్తుందని అంటున్నారు. అపుడు విజయనగరానికి కొత్త  రాజకీయ చరిత్ర కూడా మొదలవుతుందని అంటున్నారు. రాజుల మీద బీసీలు ఇపుడు పోటీకి సై అంటున్న సీన్ ఇక్కడ స్పష్టంగా ఉంది. చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: