ఒక రాష్ట్రంలో అసెంబ్లీ మరియు లోక్ సభ ఎన్నికలు ఒకే సారి జరిగితే అక్కడ ఉండే హడావిడీ అంతా ఇంతా కాదు. దానికి తగ్గట్టే నాయకుల లక్ష్యాలు కూడా నిర్దేశించబడతాయి.  అలాగే ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో కూడా మూడు ప్రధాన పార్టీల నాయకులు కూడా మూడు దారులు ఎన్నుకున్నారు. 


మొదటగా మన సీఎం చంద్రబాబు క్రితం సారి మోదీకి సంపూర్ణ మద్దతు తెలుపగా, ఈ సారి మాత్రం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ తో జతకట్టి ఒక పెను సంచలనాన్ని సృష్టించారు. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేందుకు బాబు ఇక శాయశక్తులా ప్రయత్నిస్తాడు అనడంలో సందేహం లేదు.ఇక పోతే కొత్తగా ఏర్పడ్డ జనసేన తన మొదటి ఎన్నికలకు సిద్ధమైపోయింది. అయితే పవన్ తాను మాయావతి ప్రధాన మంత్రి కావాలని కాంక్షిస్తున్నాను అని బహుజన సమాజ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. చివరికి జగన్ తెలివిగా ఎవరైతే స్పెషల్ స్టేటస్ ఇస్తారో వారికి మద్దతు ఇస్తానని ప్రజా నాడి పట్టుకున్నారు.


ఇంకొక మూడు వారాల్లో పోలింగ్ ఉన్న నేపథ్యంలో మన రాష్ట్ర ఎన్నికల ఫలితాలతో దేశంలో అనేకానేక సమీకరణాలు ముడిపడివున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. వీరి ముగ్గురిలో జగన్ కొంచెం తెలివిగా ఆలోచించినట్లు తెలుస్తోంది. ప్రత్యేక హోదా మోజుతో ఫ్యాన్ గుర్తుకు న్యూట్రల్ ఓటర్లు ఓట్లు గుద్దడం పక్కాగా కనిపిస్తోంది. ఎవరి లెక్క కరెక్ట్ అనేది తేలాలంటే వచ్చే నెల 11 వరకు ఆగాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: