విశాఖ తూర్పు ఇపుడు చాలా ఇంటెరెస్టింగ్ గా మారింది. ఇక్కడ ఈ మధ్యన చోటు చేసుకున్న అనేక పరిణామల నేపధ్యంలో చూసుకున్నపుడు ఇక్కడ గెలుపు ఎవరిది అన్న ఉత్కంఠ కలుగుతుంది. ఈ నియోజకగరం ఏర్పడినప్పటి నుంచి టీడీపీ జెండా ఎగరవేస్తూ వస్తోంది. తూర్పు ఈసారి మార్పు కోరుకుంటుందా.


ఈ మధ్య వైసీపీ టికెట్లు ప్రకటించినపుడు తూర్పు నుంచి సీనియర్ నేత గతంలో రెండు మార్లు ఇక్కడ నుంచి పోటీ చేసిన వంశీ పేరు లేదు. దాంతో ఆయన అనుచరులు స్రుష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. అయితే ఇపుడు ఆ వేడి తగ్గింది. వైసీపీ అగ్ర నేతల జోక్యంతో అంతా సర్దుకున్నారు. ఇక్కడ నుంచి పోటీ చేస్తున్న అక్రమాని విజయనిర్మల గెలుపు కోసం ఇపుడు వంశీ రెడీ అయిపోయారు. ఈ పరిణామం టీడీపీకి కలవరం కలిగించేదే. ఈ పార్టీలో వచ్చిన విభేదాలు తమకు ప్లస్ అవుతాయని టీడీపీ భావించింది. కానీ వారి ఆశ నెరవేరలేదు.


ఇక్కడ టీడీపీ విషయానికి వస్తే 2009 నుంచి ఇప్పటికి రెండు మార్లు వరసగా వెలగపూడి రామక్రిష్ణ బాబు గెలుస్తూ వస్తున్నారు. ఈసారి హ్యాట్రిక్ కొట్టాలని ఆయన చూస్తున్నారు. ఆయన కమ్మ సామజిక వర్గం, వారు  ఇక్కడ చాలా చాలా తక్కువ. అయినప్పటికీ టీడీపీ ఓటు బ్యాంక్ ఆయన్ని బాగా కాస్తోంది. ఇపుడు చూసుకుంటే తూర్పులో బలమైన యాదవ సామాజిక వర్గానికి చెందిన అక్రమాని విజయనిర్మలకు వైసీపీ టికెట్ ఇచ్చింది. పైగా ఆమె మహిళ కావడం, విద్యాధికురాలు కావడంతో ఇక్కడ ఉన్న మధ్యతరగతి, తటస్తుల ఓట్లను ఆకట్టుకుంటారని భావిస్తున్నారు.


 వెలగపూడి రెండు మార్లు ఎమ్మెల్యేగా ఉండడం ఎంత బలమో అంత మైనస్ కూడా ఉంది. ఆ వ్యతిరేకతను వైసీపీ  ఈఎన్నికల్లో బాగా వాడుకుంటోంది. మరో వైపు వైసీపీ గాలి బాగా వీస్తోంది. దాంతో అనూహ్య పరిణామలు చోటు చేసుకుంటాయని, తూర్పులో మార్పు తధ్యమని వైసీపీ ధీమాగా ఉంది. ఇక్కడ జనసెన టికెట్ కూడా  యాదవ సామాజిక వర్గానికీ  చెందిన కోన తాతారావుకు ఇచ్చింది. ఆయన ఓట్లను ఎంత బాగా చీలిస్తే వైసీపీకి అంత మైనస్ అవుతుందా అన్న డౌట్లు కూడా ఉన్నాయి.  చూడాలి. ఏం జరుగుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: