గాజువాక నుంచి పవన్ పోటీ చేయబోతుండటం తో ఇప్పుడు అందరి కళ్ళు ఈ నియోజక వర్గం మీద పడింది. అన్నయ్య చిరు సెంటిమెంట్ కలిసి వస్తుందని తమ్ముడు పవన్ బరిలోకి దిగగా... ఇప్పటికే రెండు సార్లు బరిలోకి దిగి... ముచ్చటగా మూడో పర్యాయం కూడా ఇక్కడి నుంచే పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి... అటు పవన్ తో పాటు ఇటు సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు చెమటలు పట్టించడం ఖాయంగానే కనిపిస్తోంది. ప్రజారాజ్యం గెలిచిన సారి ఇక్కడి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన తిప్పల నాగిరెడ్డి... ఏకంగా కాంగ్రెస్ పార్టీని మూడో స్థానానికి నెట్టేసి... రెండో స్థానంలో నిలిచారు.

Image result for palla srinivasa rao

నాడు పీఆర్పీ అభ్యర్థి వెంకట్రామయ్యకు 50994 ఓట్లు రాగా... తిప్పల నాగిరెడ్డికి 33087    ఓట్లు పడ్దాయి. ఇక కాంగ్రెస్ తరఫున నాడు బరిలోకి దిగిన తిప్పల గురుమూర్తి రెడ్డికి 29547 ఓట్లు మాత్రమే పడ్డాయి. ఆ తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో పీఆర్పీతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా అడ్రెస్ లేకుండా పోవడంతో పల్లా శ్రీనివాసరావు - తిప్పల నాగిరెడ్డిల మధ్యే పోటీ నెలకొంది. ఆ ఎన్నికల్లో గాజువాక ఓటర్ల సంఖ్య భారీగా పెరగగా... వీరిద్దరు సాధించిన ఓట్లు కూడా అమాంతంగా పెరిగిపోయాయి. పల్లాకు 97109 ఓట్లు రాగా... వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన తిప్పలకు 75397 ఓట్లు పడ్డాయి. గెలిచిన అభ్యర్థికి తొలి సారి కంటే రెండో సారి కాస్తంత మెజారిటీ పెరిగినా... తిప్పల మాత్రం తన ఓట్ల షేరింగ్ ను భారీ ఎత్తున పెంచేసుకున్నారు. 

Image result for pavan kalyan jansena

ఇక అన్నింటికంటే ముఖ్యంగా ప్రస్తావించుకోవాల్సిన విషయం ఏమిటంటే... ఇక్కడి నుంచి పవన్ కల్యాణ్ పోటీకి దిగుతుండటమే. తన సొంత సామాజిక వర్గానికి చెందిన ఓట్లు భారీ సంఖ్యలో ఉండటం - కొత్త ఓటర్ల నమోదు రికార్డు సృష్టించిన నియోజకవర్గం కావడంతో యువత భారీ ఎత్తున ఉందన్న భావనతో పవన్ ఇక్కడ పోటీకి దిగారు. అయితే తన సొంత సామాజిక వర్గం ఓట్లన్నీ తనకే వస్తాయన్న ధీమా పవన్ కు లేదనే చెప్పాలి. ఎందుకంటే... ఇటు పల్లా - తిప్పలతో పాటుగా బీజేపీ తరఫున బరిలోకి దిగుతున్న పులుసు జనార్దన్ పక్కా లోకల్. జీవీఎంసీ మేయరుగా 2007 నుంచి 2012వరకూ పనిచేసిన పులుసు... గాజువాకలో రూ.కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేశారు. ఈ క్రమంలో పులుసు కూడా ఓ మోస్తరు ఓట్లను తన ఖాతాలో వేసుకునే తీరతారని చెప్పక తప్పదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: