ప్ర‌త్యేక హోదాపై వైసీపీ విజ‌య‌వాడ ఎంపీ అభ్య‌ర్థి పొట్లూరి వ‌ర‌ప్ర‌సాద్ చేసిన కామెంట్లు క‌లక‌లం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. పీవీపీ మాట‌ల‌ను పేర్కొంటూ అధికార తెలుగుదేశం పార్టీ విమ‌ర్శ‌లు గుప్పిస్తోంది. ఈ నేప‌థ్యంలో పీవీపీ విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. ప్రత్యేక హోదా గురించి నేను మాట్లాడిన మాటలను వక్రీకరించారని పీవీపీ వెల్ల‌డించారు. ``నా ప్రసంగం ఆంగ్లంలో ఉంది. నేను మాట్లాడిన పూర్తి సారాంశాన్ని ప్రసారం చేయలేదు. ఎడిట్ చేసిన మాటలతో వివాదాస్పదం చేశారు. అర్థం కాక‌పోతే, చంద్రబాబు,గల్లా జయదేవ్ తో  ట్రాన్స్ లేట్ చేయించుకుంటే మంచిది.`` అని ఎద్దేవా చేశారు.


``ఆ స‌మావేశంలో నాకు ఐదు నిముషాలు సమయం ఇచ్చారు.మా లీడర్ ప్రత్యేకహోదా గురించి స్పష్టంగా చెప్పారు.అని వివరించి మిగిలిన అంశాలపై మాట్లాడదాం అని క్లియర్ గా చెప్పాను. ఇంగ్లీషు లో చెప్పింది అర్తం చేసుకోలేకపోతే నేనేం చేయగలను? చంద్రబాబుకు త‌న వాళ్లు సరిగా బ్రీఫ్డ్  చేసినట్లు లేదు. నేను అనని మాటలు నాకు ఆపాదించి ఓ పార్టీ అధ్యక్షుడిగా ఆయ‌న‌ మాట్లాడుతున్నాడు. ఆ పార్టీ అధ్యక్షుడు ప్రత్యేక హోదాపై నాలుగు సంవత్సరాలు ఏం నిర్ణయం తీసుకున్నారో మీ అందరికి తెలుసు.

నా వీడియో లు మార్ఫింగ్ చేస్తారు.ప్రతి దానికి ఆన్సర్ చేసుకుంటా వెళ్తే సమయం వృధానే కదా? వాళ్ల ట్రాప్ లో వారి మైండ్ గేమ్ లో మేం పడం.నాలుగుసవంత్సరాల  11 నెలల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం సాగిస్తోంది``అని వెల్ల‌డించారు. ప్రత్యేక హోదాపై ఎవరికి చిత్తశుద్ది ఉందో రాష్ట్ర ప్రజలదరికి తెలుస‌ని పీవీపీ వెల్ల‌డించారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం 19 మే 2014లో ప్రారంభం అయింది. తెలుగుదేశం ఆనాటి నుంచి వెన్నుపోటు పొడుస్తుంద‌న్నారు. ``ప్యాకేజి ఇచ్చినందుకు ప్రధాని నరేంద్రమోదికి అసెంబ్లీలో ధన్యవాదాలు తెలిపింది చంద్రబాబు కాదా? `` అని సూటిగా ప్ర‌శ్నించారు. 


కొందరు మైండ్ గేమ్ ఆడుతున్నారని, వారు ఆడుతున్న మైండ్ గేమ్ లో తాము పడబోమ‌ని పీవీపీ స్ప‌ష్టం చేశారు. ``ఈ ఊర్లో పుట్టి ఈ ఊర్లో పెరిగిన వాడిని.నేనేంటో విజయవాడ ప్రజలకు బాగా తెలుసు. అదిరేది బెదిరేది లేదు. నాకు ఏ ప్రభుత్వంతో ఏ వ్యాపారం లేదు. ఎవరికి దడవాల్సిన అవసరం లేదు. ఈ 20 రోజులు వాళ్లు మమ్మల్ని ఏమైనా అననివ్వండి. తలవంచుకుని వెళ్తాం. మా లక్ష్యం ఏప్రిల్ 11,2019.మేం ప్రజలకు సర్వ్ చేయడానికి ఉన్నాం. హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, ఎంప్లాయిమెంట్ ఇష్యుస్ ఉన్నాయి. రోజంతా తిట్టడం వల్ల ఉపయోగం ఏంటి? హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ ,ఎంప్లాయిమెంట్ ఇష్యుస్ ఉన్నాయి.రోజంతా తిట్టడం వల్ల ఉపయోగం ఏంటి? `` అని సూటిగా ప్ర‌శ్నించారు. ప్రత్యేక హోదా గురించి  విధానం గురించి త‌మ పార్టీ అధ్యక్షుడు ఇప్ప‌టికే విధానం స్ప‌ష్టం చేశార‌న్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: