ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఈ క్రమంలో వైసీపీ పార్టీ అధినేత ఏపీ ప్రతిపక్ష నేత జగన్ తన సొంత నియోజకవర్గం పులివెందులలో నామినేషన్ కోసం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ పులివెందుల గడ్డపై పుట్టినందుకు గర్వపడుతున్న అంటూ పులివెందుల ప్రజలనుద్దేశించి ప్రసంగాన్ని మొదలుపెట్టారు.

Image result for ys jagan at pulivendula meeting

అధికార పార్టీ టీడీపీ పై మరియు చంద్రబాబు ఇచ్చిన హామీలను నమ్మి మోసపోయిన ప్రజల గురించి వైయస్ జగన్ చేసిన ప్రసంగం అందరికీ ఆశ్చర్యానికి గురి చేసింది. రాష్ట్రంలో ఉన్న ప్రతి వర్గానికి చెందిన ప్రజలను గత ఎన్నికలలో అబద్ధపు హామీలు ఇచ్చి మోసం చేశారని ముఖ్యంగా రైతులను మహిళలను చంద్రబాబు దారుణంగా మోసం చేశారని..ప్రస్తుతం పసుపు కుంకుమ పేరుతో చంద్రబాబు డ్రామాలాడుతున్నారని మళ్లీ మోసం చేయడానికి రెడీ అవుతున్నారని...ఉద్యోగాలు లేక రాష్ట్ర యువతను మోసం చేశారని..నిరుద్యోగ భృతి అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పారని. కడప ప్రాంతంలో కడప స్టీల్ ఫ్యాక్టరీ కూడా పూర్తి చేయకుండా కడప ప్రజలను మోసం చేశారని..ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న యువత మొత్తం ఉద్యోగాలు లేక ఇతర రాష్ట్రాలకు వలసలు పోతున్నారని పేర్కొన్నారు. 

Related image

అధికార పార్టీ టిడిపి ఓడిపోతుందని ముందే తెలుసుకుని చీకటిలో ఇతర పార్టీలతో కలిసి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని టిడిపి అధినేత చంద్రబాబును ఉద్దేశించి సంచలన కామెంట్ చేశారు జగన్. కచ్చితంగా రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తాయని నిజం వెలుగులోకి వస్తుందని...ప్రస్తుతం చీకటి రాజ్యం కొనసాగుతుందని ఎల్లప్పుడూ చీకటి ఉండదని... వెలుగు రావటం ఖాయమని జగన్ అద్భుతంగా ప్రసంగించారు. జగన్ పులివెందుల సభలో చేసిన ప్రసంగానికి ఆ ప్రాంత ప్రజలు ఎంతగానో సంతోషపడ్డారు. మాట మీద నిలబడటం మరియు ఇచ్చిన మాట కోసం నిలబడటం పులివెందుల నేర్పిందని రాబోయేది మన ప్రభుత్వమని ఖచ్చితంగా అందరికీ మంచి జరుగుతుందని జగన్ ఈ సందర్భంగా ప్రజలకు భరోసా ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: