ఎన్నికలకు మూడు నెలల ముందుగానే అభ్యర్ధుల ప్రకటించనున్నట్లు చెప్పారు. తర్వాత నోటిఫికేషన్ విడుదలకు ముందుగానే అభ్యర్ధుల ప్రకటన అన్నారు. తీరాచూస్తే షెడ్యూల్ విడుదలైంది. అభ్యర్ధుల పూర్తిజాబితా మాత్రం విడుదలవ్వలేదు. పైగా ఏడాది ముందుగానే అన్నీ నియోజకవర్గాల్లో సర్వేలని ఫీడ్ బ్యాక్ అంటూ నానా హడావుడి చేశారు. ఇంత చేసినా అభ్యర్ధుల పూర్తి జాబితాను ఎందుకు విడుదల చేయలేకపోతున్నారు ? ఇంకా మార్పులు చేర్పులు జరుగుతునే ఉన్నాయి.

 Image result for tdp candidates tickets row

ఎందుకంటే, ఉరుములేని పిడుగులాగ రిలీజైన వైసిపి జాబితాను చూసిన తర్వాత చంద్రబాబు మైండ్ బ్లాంక్ అయ్యిందట. ఒకేరోజు ఎంపిలు, ఎంఎల్ఏల జాబితాను జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. వైసిపి జాబితాను చూసిన తర్వాత అందరు కూడా బ్రహ్మాండమనే అంటున్నారు.  టికెట్ల కేటాయింపులో కొత్తవారికి, మహిళలకు, బిసిలకు జగన్ పెద్దపీట వేశారు.

 Image result for tdp candidates tickets row

అదే సమయంలో చంద్రబాబు రిలీజ్ చేసిన మొదటి 126 మంది జాబితాలో పెద్దగా చెప్పుకోతగ్గవేమీ లేదు. ఎందుకంటే, అందరూ పాతవారే. ఐదేళ్ళ పాలనలో విపరీతంగా అవినితి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారే. స్వయంగా చంద్రబాబే టికెట్లు ఇవ్వటం సాధ్యం కాదని ఒకపుడు చెప్పిన వారికి కూడా చివరకు టికెట్లిచ్చేశారు. దాంతో టిడిపి జాబితాపై పెద్దగా అంచనాల్లేవు.

 

సరే రిలీజైన జాబితా సంగతి పక్కనపెడితే ప్రకటించబోయే మిగిలిన జాబితాలో కూడా పెద్దగా సంచలనాలుండే అవకాశాలు లేవని అర్ధమైపోయింది. లోక్ సభ అభ్యర్ధుల్లో ఒక్కరిని కూడా ప్రకటించలేదు. ఎందుకంటే, 25 లోక్ సభ నియోజకవర్గాల్లో టిడిపి తరపున పోటి చేసేందుకు కనీసం 17 నియోజకవర్గాల్లో ఇంకా అభ్యర్ధులను వెతుక్కుంటున్నారు.  పోటీ చేయటానికి సుముఖంగా ఉన్న అభ్యర్ధుల్లో కూడా అంత గట్టివారు లేరు.  అదే సమయంలో ప్రకటించిన జాబితాలో కూడా కొన్నిచోట్ల అభ్యర్ధులు విరమించుకుంటున్నారు.

 

వైసిపి జాబితాపై జనాల్లో సానుకూలత, టిడిపి జాబితాపై పెదవి విరుస్తున్న జనాలను చూసిన తర్వాత చంద్రబాబులో టెన్షప్ పీక్ స్టేజికి చేరుకుంటోంది. ప్రకటించిన జాబితాపైన కూడా పార్టీ నేతల్లోనే అసంతృప్తులు బయటపడుతున్నాయి. దాంతో ప్రకటించబోయే అభ్యర్ధులను ఏ ప్రాతిపదికన ఎంపిక చేయాలో చంద్రబాబుకు అర్ధం కావటం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: