చంద్రబాబు రాజకీయ వారసుడిగా పాలిటిక్స్ లో ఎంట్రీ ఇచ్చిన నారా లోకేష్ మొదటిగా ఎమ్మెల్సీగా పార్టీ తరఫున నామినేట్ అయ్యి వెంటనే మంత్రి పదవి చేపట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయ నేతలకు షాక్ ఇచ్చారు. గత నాలుగు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉంటూ పార్టీ వ్యవహారాలను చూస్తున్న మరో పక్క తన తండ్రి ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్న నారా లోకేష్ తాజాగా రాబోతున్న 2019 ఎన్నికల ప్రజాక్షేత్రంలో ప్రజల మనసులను గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టడానికి రంగం సిద్ధం చేసుకున్నారు.

Image result for naralokesh

ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా మంగళగిరి ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిలబడి నారా లోకేష్..ఆ ప్రాంతంలో జరుగుతున్న ప్రచారంలో చురుకుగా పాల్గొంటున్నారు. అయితే గతంలో లాగానే భారీ బహిరంగ సభలలో నోరు పరచుకునే నారా లోకేష్ తాజాగా ఎన్నికల ప్రచారంలో కూడా..తన స్పీచ్ లో నాలుక కరుచుకుంటూ తనతో పాటు వచ్చిన తెలుగుదేశం నాయకులను నవ్వులపాలు చేస్తున్నట్లు సమాచారం.

Related image

ముఖ్యంగా ఎన్నికల తేదీని నారా లోకేష్ ఏప్రిల్ 9 మార్చేసుకున్నారు తన ప్రసంగంలో ఇటీవల. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న క్రమంలో నారా లోకేష్ ప్రచారంపై నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. చంద్రబాబు రాజకీయ వారసుడిగా నారా లోకేష్ అద్భుతం అని మరికొంతమంది సెటైర్లు వేస్తున్నారు. మొత్తంమీద ఎన్నికల ప్రచారంలో భాగంగా లోకేష్ ప్రతిరోజూ తన స్పీచ్ లో ఏదో ఒకటి తప్పుగా మాట్లాడటం..అది కాస్త వైరల్ కావడంతో ప్రత్యర్థి పార్టీలకు చెందిన నాయకులు మరియు కార్యకర్తలు లోకేష్ పై సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: