పై ఫొటోలో ఉన్న నాయకుడు కడప తెలుగుదేశంపార్టీ అభ్యర్ధి అమీర్ బాబు. పార్టీ కార్యాలయంలో ఒక్కసారిగా భోరున ఏడ్చేశారు. టికెట్ రాని వాళ్ళు ఏడ్వాలి గానీ టికెట్ వచ్చిన తర్వాత కూడా ఏడుపెందుకు ? ఆ విషయమే ఎవరికీ అర్ధంకాలేదు. అదే విషయాన్ని ఆరాతీస్తే అసలు విషయం తెలిసిందే.

 

అమీర్ బాబు సీనియర్ నేతల్లో ఒకరు. పార్టీ కోసం ఉన్న ఆస్తినంతా ఊడ్చిపెట్టేశారట. పార్టీ నిర్వహించిన ప్రతీ కార్యక్రమాన్ని దగ్గరుండి మరీ చూసుకునేవారట. మరి అంతగా ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత ఇంకేముంటుంది ? అమీర్ బాబు విషయంలో కూడా అదే జరిగింది. తన పరిస్దితిని వివరించి సాయం చేయమని అడిగితే ఎవరూ సాయం కూడా చేయలేదట.

 

ఇంతలో ఎన్నికలు రావటం, అమీర్ కు టికెట్ రావటం అన్నీ చకచక జరిగిపోయాయి. చంద్రబాబు టికెట్ అయితే ఇచ్చారు కానీ మరి డబ్బుల మాటో ? అదే విషయాన్ని పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో భేటీ సందర్భంగా చెప్పుకుని ఒక్కసారిగా భోరుమనేశారు. తనను అందరూ చిన్నచూపు చూస్తున్నట్లు మండిపడ్డారు. పార్టీ నేతల్లో దోచుకునే వాళ్ళు దోచుకుంటుంటే, జెండాలు మోసేవాళ్ళు మోస్తూనే ఉన్నారట. సరే ఆ సందర్భంగా గుర్తుకొచ్చిన వారందిరినీ అమ్మనాబూతులు తిట్టారు లేండి. అంతా బాగానే ఉంది మరి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అమీర్ బాబుకు ఎవరైనా డబ్బు సాయం చేస్తారా ?

 


మరింత సమాచారం తెలుసుకోండి: