ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి సెల్ఫ్ గోల్స్ కొత్తేమీ కాదు. గత ఎన్నికల సమయంలో మణిశంకర్ అయ్యర్ వేసిన సెల్ఫ్ గోల్స్ తో ఆ పార్టీ ఆత్మరక్షణలో పడిపోయింది. ఇప్పుడు కూడా అలాంటి సెల్ఫ్ గోల్ ఒకటి పడింది. ఆ పార్టీ విదేశీ వ్యవహారాల పర్యవేక్షకుడు శ్యా పిట్రోడా ఈ గోల్ వేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి ఏం చేయాలో దిక్కు తోచట్లేదు.

Image result for sam pitroda

భారత్ – పాక్ అంశం లేకుండా అక్కడకానీ, ఇక్కడ కానీ ఎన్నికలుండవ్. ఇప్పుడు కూడా బీజేపీ సర్జికల్ స్ట్రైక్స్ అస్త్రంగా చేసుకుని ముందుకెళ్తోంది. ఈ నేపథ్యంలో జమ్ము కశ్మీర్ లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిపై కాంగ్రెస్ పార్టీ అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు శ్యాం పిట్రోడా సంచలన వ్యాఖ్యలు చేశారు. “పుల్వామాలో జరిగిన దాడిపై పాకిస్తాన్ ను నిందించలేం” అన్నారు. గతంలో కూడా ముంబైలో దాడులు జరిగాయన్న ఆయన.. ఆ తర్వాత తాము వెళ్లి పాకిస్తాన్ లో దాడులు చేయలేదన్నారు. ఇలాంటి వ్యవహారాలను డీల్ చేసే పద్ధితి ఇది కాదన్నారు. కొంతమంది ఉగ్రవాదులు చేసిన పనికి పాకిస్తాన్ ను నిందించలేమన్నారు.

Image result for sam pitroda

ఇప్పుడు శ్యాం పిట్రోడా వ్యాఖ్యలు ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారాయి. పిట్రోడా వ్యాఖ్యలు వ్యక్తిగతమని, పార్టీకి సంబంధం లేదని ఆ పార్టీ ఖండించింది. పిట్రోడా కామెంట్స్ ఇప్పుడు బీజేపీకి అస్త్రంలా మారాయి. పిట్రోడా వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ట్విట్టర్లో స్పందించారు. నాడు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంపై కాంగ్రెస్- యూపీఏ ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీకి అత్యంత ఆప్తుడైన పిట్రోడా కామెంట్స్ పై ఆ పార్టీ నేతలు ఇప్పుడు ఏమంటారని ఆయన ప్రశ్నించారు.

Image result for sam pitroda

పిట్రోడా కామెంట్స్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చిక్కులు తెచ్చిపెట్టాయి. మణిశంకర్ అయ్యర్ ఎన్నికల ముందు సరిగ్గా ఇలాంటి కామెంట్స్ తోనే చిక్కులు తెచ్చిపెట్టారు. ఇప్పుడు మేధావిగా పేరొందిన శ్యాంపిట్రోడా కామెంట్స్ తో ఆ పార్టీకి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది.


మరింత సమాచారం తెలుసుకోండి: