టీవీ ఛానెల్లో తెలుగు దేశంకు సంభందించిన ప్రకటనలు హోరెత్తిస్తున్నాయి. బోయపాటి చేసిన ప్రకటనలు ఓ రేంజ్ లో స్ప్రెడ్ అవుతున్నాయి. జగన్ పార్టీ కోసం సుధీర్ వర్మ, మహి లాంటివాళ్లు ప్రకటనలు తయారుచేసారు. వీళ్లకు ఈ రంగంలో వున్నపట్టు అంతంత మాత్రం. రాజకీయ అవగాహన అంతంత మాత్రం. దాంతో వీళ్లు చేసిన ప్రకటనలు పెద్దగా ఆకట్టుకునేలా లేవు. పైపైకి తేలిపోయాయి. మరోపక్క బోయపాటి తెలుగుదేశం పార్టీ కోసం చేసిన ఆరేడు ప్రకటనలు చాలా క్వాలిటీతో వున్నాయి. కాన్సెప్ట్ లు కానీ, మేకింగ్ కానీ పూర్తిగా ఓ స్థాయిలో వుంది. వాటితో పోల్చుకుంటే మహి, సుధీర్ వర్మ చేసిన ప్రకటనలు వెలవెలబోతున్నాయి.

Image result for jagan

ఇదిచాలదన్నట్లు ఎవరు చేసారో కానీ, హైదరాబాద్ లో ఉద్యోగం రాలేదు, బాబుపోతే వస్తుంది అనే యాడ్ ఒకటి ఫుల్ గా ట్రోలింగ్ కు గురవుతోంది. హైదరాబాద్ లో ఉద్యోగం రాకపోవడానికి బాబుకు సంబంధం ఏమిటి అని జనాలు నిలదీస్తున్నారు. హైదరాబాద్ లో బాబు లేక జాబు రాలేదు అని రివర్స్ వేస్తున్నారు. నిజానికి పూరి జగన్నాధ్ లాంటి మేకర్లు వైకాపాకు దన్నుగా వున్నారు. ఆయన తమ్ముడు వైకాపా టికెట్ మీద పోటీ చేస్తున్నారు. అలాంటి వాళ్ల సేవలు వాడుకోవాలి. జగన్ కు ఇవేమీ పట్టవు. ఆయన ఎవరికీ ఏమీచెప్పరు. చేయించుకోరు. తనబాధ, తన తిరుగుడు, తన జనాలు తప్ప వేరేవాటిని నమ్ముకోరు.

Image result for jagan

తెలుగుదేశం పార్టీకి అలాకాదు. ఎవరికి వారు చొక్కాలు చింపుకునేంత అభిమానంతో పనిచేసేవారు, స్వంత డబ్బులు ఖర్చు చేసేవారు వున్నారు. వైకాపాకు ఈ పరిస్థితి లేదు. జగన్ చుట్టూ వున్న కోటరీకి తెలియదు. తెలిసిన వారిని దగ్గరకు రానివ్వరు. దాంతో పరిస్థితి అలాగే వుంది. ఈసారి కూడా జగన్ వైపు సర్వేలు, బజ్ తప్ప, పోల్ మేనేజ్ మెంట్ చేయలేకపోయారు. ఈసారి కూడా పవన్, పాల్, వామపక్షాలు, బిఎస్సీ ఇలా అన్నివైపుల నుంచి తేదేపా శ్రేణులను మోహరించింది. వీటిని ఛేధించి గెలవాలంటే కేవలం జగన్ మీటింగ్ లు చాలవు. అంతకు మించి వ్యూహరచన కావాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: