అద్భుత రాజధాని అమరావతి, దేశం గర్వించే అతి పెద్ద జల ప్రాజేక్ట్ పోలవరం. నవ్యాంధ్రలో ఈ రెండూ విషయాలు లేకుండా టీడీపీ అయిదేళ్ళ పాలన సాగింది లేదు. మీడియాలో ఈ పదాలు రాకుండా రోజు ముగిసిందీ లేదు. నిజానికి గత ఎన్నికల్లో ఈ రెండు అంశాలు చివరాఖర్లో ఓ రాజకీయ పార్టీ జాత‌కాన్నే మార్చేశాయి.


మరి అటువంటి కీలకమైన రెండు ప్రధాన అంశాలు ఇపుడు ఎన్నికల అజెండాలో ఉన్నాయా. ఎక్కడైనా చర్చకు వస్తున్నాయా. అంటే లేదనే చెప్పాలి. ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ వీటినే ప్రచార అస్త్రాలుగా మలచుకుని నాడు గెలిచింది. మరి నేడు ఎందుకు వీటిని పక్కన పెట్టేసింది. కావాలనే వదిలేసిందా. అంటే అవుననే అంటున్నారు విమర్శకులు. అమరావతి గురించి చెప్పాలంకుంటే అక్కడ ఏముంది. పోలవరం ఘనతను వాడుకోవాలని చూసినా ఇపుడు మైనస్ అవుతుంది. అందుకే గమ్మున ఉండి మిగిలిన వాటినే టీడీపీ ఏకరువు పెడుతోంది


గత పది రోజులుగా చంద్రబాబు ప్రసంగాలు తీసుకుంటే అందులో జగన్ని నేరగాడుగా ముద్ర వేయడం, వివేకా హత్యను వాడుకోవడమే కనిపిస్తోంది. జగన్ కి ఒక్క చాన్స్ ఇవ్వవద్దని చెబుతున్న బాబు అందుకు ఆయన కుటుంబం నేరమయమైనదని ప్రచారం చేసున్నారు. ఈ నెగిటివ్ ప్రచారంతోనే ఓట్ల పంట పండించుకోవాలనుకుంటున్నారు. చిత్రమేంటంటే తన పాలన భేష్, తాను చేసిన అన్ని కార్యక్రమాల పట్ల జనం పూర్తి సంత్రుప్తిగా ఉన్నారని ఇన్నాళ్ళూ ఊదరగొట్టిన టీడీపీ పెద్దలు ఇపుడు ఆ వూసే మరచిపోయారు. కేవలం జగన్ని తిడితే ఓట్లు పడతాయా. చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: