ఎన్నికలు దగ్గర పడే కొద్దీ పొలిటికల్ వేడి ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో విపరీతంగా కనిపిస్తోంది. ఒక పక్క ఎండలకి ఎండలు మరొక పక్క జనాలలో ఏ పార్టీ కి ఓట్లు వెయ్యాలి అనే విషయం మీద డిస్కషన్ లూ ..


ఇవన్నీ ఇలా హాట్ హాట్ గా  సాగుతున్న క్రమం లో తెలుగు దేశం vs వైకాపా యొక్క హడావిడి భారీగా సాగుతోంది.  రాజకీయ నాయకుల కి కీలక తరుణం అయినటువంటి ఈ పరిస్థితి లో రాష్ట్ర రాజకీయాల్లో ఎక్కువశాతం మంది వైకాపా లోకి రావడానికి ఆసక్తి చూపిస్తున్నారు.



దీనికి ప్రత్యక్ష ఉదాహరణ గా రీసెంట్ పరిణామాల గురించి చెప్పాలి. ఈ మధ్య కాలం లో దాదాపు 1100 మంది లీడర్లు , రాజకీయ నాయకులు వైకాపా లోకి జాయిన్ అయ్యారు. వారిలో అత్యధికులు టీడీపీ నుంచే కావడం విశేషం. బుట్టా రేణుక , రవీంద్ర బాబు , అవంతి శ్రీనివాస్ , ఆమంచి కృష్ణ మోహన్ లాంటి వారు తమ తమ నిర్ణయాలు తీసుకుని టీడీపీ కి హ్యాండ్ ఇచ్చిన సంగతి తెలిసిందే .


ముఖ్యంగా కుల రొచ్చు లో చంద్రబాబు రాష్ట్రాన్ని నడుపుతున్నారు అనేది వారి ప్రధాన ఆరోపణ. ఆ తరవాత దాసరి జయరమేష్ , దగ్గుబాటి వెంకటేశ్వర రావు లాంటి టీడీపీ ఉద్దండులు వైకాపా నే బెటర్ చాయిస్ గా ఫీల్ అయ్యారు.



వారితో పాటు అనేకమంది ఎమ్మెల్సీ లూ , మాజీ ఎమ్మెల్యే లూ , మాజీ మంత్రులూ వైకాపా కి గొప్ప బలంగా వచ్చి జాయిన్ అయ్యారు. కేవలం గడిచిన వారం రోజుల్లో అరవై తొమ్మిది లీడర్లు అసంబ్లీ లెవల్ లో 310 లీడర్ లు  మండల లెవెల్ లో ఎనిమిది వందల మంది నాయకులు గ్రామ స్థాయి లో టీడీపీ లోంచి వైకాపాలోకి వచ్చారు అంటే రాష్ట్రవ్యాప్తంగా జగన్ బలం ఎలా ఉంది అనేది అర్ధం చేసుకోవచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి: