2019 సార్వత్రిక ఎన్నికలు ఇక పట్టుమని 15 రోజులు కూడా లేవు. అయితే ఇప్పటికే పలు సర్వేలు ఎవరు గెలవచ్చని తమ ఫలితాలను ప్రకటించాయి. అయితే ఇప్పుడు మరో సర్వే తాము చాలా పక్కాగా గ్రామాల్లో కూడా సర్వే చేశామని చెబుతుంది. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లో ఉత్కంఠగ రేపుతోన్న మూడు నియోజక వర్గాలు ఎవరు గెలుస్తారని ప్రజలు చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అవే లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి, చింతల ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న దెందులూరు, పవన్ పోటీ చేస్తున్న భీమవరం. 

Image result for lokesh

అయితే ఆ సర్వే వెల్లడించిన ప్రకారం మంగళగిరిలో ఫలితాలు చాలా పోటా పోటీగా ఉండబోతున్నాయని అయితే లోకల్ కాండిడేట్ అయినా వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణ కే ఎడ్జ్ ఉందని సర్వేలో తేలిందంటా .. ఇప్పటికే లోకేష్ ఆ నియోజకవర్గం మొత్తం సుడిగాలి పర్యటన చేస్తున్నాడు. అయితే లోకేష్ విజయం నల్లేరు మీద నడక లాంటిదని కాదని తెలుస్తుంది. ఇక చెప్పుకోవాల్సిన నియోజకవర్గం దెందులూరు. 

Image result for chintamaneni prabhakar

ఈ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా చింతల ప్రభాకర్ రావు టీడీపీ నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నియోజకవర్గంలో తాము సర్వే చేయలేకపోయామని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది. జనాలు అస్సలు చెప్పటం లేదంటా. ప్రభాకర్ పంపించాడేమోనని చాలా మంది భయపడి చెప్పలేదని సమాచారం. అయితే ఈ నియోజకవర్గంలో ప్రభాకర్ మీద వ్యతిరేకత ఉన్న పోటీ మాత్రం హోరా హోరీగా ఉండబోతుందని తెలుస్తుంది. ఇక భీమవరంలో పవన్ విజయం అంత ఈజీ అయితే కాదని తెలుస్తుంది. గాజువాకలో మాత్రం పవన్ బంపర్ మెజారిటీతో గెలవబోతున్నాడని సర్వేలో తేలిందంట. 

మరింత సమాచారం తెలుసుకోండి: