సాధారణంగా కుంటుంబ సభ్యులు తమ ఇంటి నుంచి ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేస్తే తమ సపోర్ట్ మాత్రమే కాదు తమ బంధు, మిత్రుల సపోర్ట్ కూడా అందేలా చూస్తుంటారు.  కానీ ఇప్పుడు ఏపిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మూడు దారుల్లో వెళ్తున్నారు.  ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా మూడు పార్టీల మద్య తీవ్ర స్థాయిలో పోటీ జరుగుతుంది.  టీడీపీ, వైసీపీ, జనసేన..ఈ పార్టీలు ఢీ అంటే ఢీ అనేలా పోటీని తలపిస్తున్నాయి.  అయితే ఈ పార్టీల తరుపు నుంచి ఒకే కుటుంబ సభ్యులు పోటీ చేయడం విశాఖలో ఆసక్తి రేపుతుంది. అన్న టీడీపీ..తమ్ముడు జనసేన. ఇక వారి చెల్లె వైసీపీ  పార్టీల తరుపు నుంచి ప్రచారంలోకి దిగుతున్నారు.  


గవిరెడ్డి రామానాయుడు టీడీపీ అభ్యర్థిగా మాడుగుల నియోజకవర్గంలో మంచి పేరు సంపాదించారు.  గత ఎన్నికల్లో 2019, 2014 పోటీ చేసి ఓడారు.  ఇప్పుడు మరోసారి టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు.  ఈసారి ఎలాగైనా గెలిచి తీరుతానని పంతం మీదే ఉన్నారు.  ప్రజాబలం ఉన్న నాయకుడిగా నియోజకవర్గంలో మంచి పేరుంది.  ఇక గవిరెడ్డి రామానాయుడి సోదరుడు సన్యాసినాయుడు.  పవన్ కళ్యాన్ అంటే ఎంతో అభిమానం ఉన్న ఆయన జనసేన పార్టీ తరుపు నుంచి పోటీ చేస్తున్నారు.  ప్రస్తుతం అన్నదమ్ముల మధ్య పోరు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.  


అయితే అన్నదమ్ములను సవాల్ చేస్తూ వాళ్ల సోదరి..సినీ నటి రమ్యశ్రీ వైసీపీ తరుపు ప్రచారానికి దిగింది.  వైసీపీ పార్టీ మొదలు పెట్టినప్పటి నుంచి జగన్ అంటే ఎంతో అభిమానం చూపిస్తున్నారు నటి రమ్యశ్రీ .  అన్నదమ్ములకు పోటీగా వైసీపీ నుంచి బరిలో నిలిచిన ముత్యాలనాయుడు విజయానికి కృషి చేస్తున్నారు.  మాది  కుటుంబం.. రక్త సంబంధీకులమే అయినా పార్టీ గెలుపు కోసం కృషి చేస్తున్నాం.  తమ మద్య కేవలం రాజకీయ విభేదాలే తప్ప వ్యక్తిగత కక్షలేమీ లేవని రమ్యశ్రీ చెప్తున్నారు.  మొత్తానికి రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా.. వీళ్ల కుటుంబం రూలింగ్‌లో ఉన్నట్టే.


మరింత సమాచారం తెలుసుకోండి: