సప్నా చౌదరి.. ఈ పేరు నార్త్ ఇండియాలో చాలా పాపులర్. ఓపెన్ స్టేజ్ డ్యాన్సర్ గా సప్నా చౌదరి సుపరిచితురాలు. అయితే ఆమె ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారంటూ వార్తలు గుప్పుమన్నాయి. హేమమాలినిపై పోటీ చేసేందుకు ఆమె సిద్ధమయ్యారంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడ్తున్నాయి. అయితే ఇవన్నీ రూమర్సేనని కొట్టి పారేసింది సప్నా చౌదరి.

Image result for sapna choudhary dance

నార్త్ ఇండియాలో ఓపెన్ స్టేజ్ డ్యాన్స్ చాలా ఫేమస్. మన దగ్గర రికార్డింగ్ డ్యాన్స్ ల్లాంటివన్నమాట. ఏదైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు ఇలాంటి ఓపెన్ స్టేజ్ డ్యాన్స్ లను ఆర్గనైజ్ చేస్తుంటారు. ఇలాంటి డ్యాన్స్ లు చేయడంలో సప్నా చౌదరి చాలా ఫేమస్. ఈమెకు లక్షల్లో ఫాలోయర్స్ ఉన్నారు. సెలబ్రిటీల డ్యాన్స్ షోలలో ఈమె కనిపిస్తుంటారు. తమకోసం డ్యాన్స్ చేయాలంటూ పలువురు రాజకీయ నాయకులు కూడా ఈమెను రిక్వస్ట్ చేస్తుంటారంటే నమ్మండి. ఈమె ఈవెంటే జరిగుతోందంటే అక్కడ పండగే మరి.

Image result for sapna choudhary dance

హిమాచల్ ప్రదేశ్ కు చెందిన సప్నా చౌదరి ఇటీవల  కాంగ్రెస్ పార్టీలో చేరిందనే వార్త వినిపించింది. ఆమె మధుర లోక్ సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి హేమమాలినిపై పోటే చేయబోతోందని మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ రూమర్స్ పై సప్నా చౌదరి స్పందించింది. తాను కాంగ్రెస్ పార్టీలో చేరలేదని క్లారిటీ ఇచ్చింది. తనకు అలాంటి ఉద్దేశం కూడా లేదని తేల్చేసింది. తాను గతంలో ప్రియాంకను కలిసినప్పుడు ఫోటోలను ఇప్పుడు బయటపెట్టి కొంతమంది అలా భావిస్తున్నారని వివరణ ఇచ్చింది. తాను ఏ పార్టీ తరపున కూడా ప్రచారం చేయబోనని తేల్చేసింది. అంతేకాక తనకు సోషల్ మీడియా అకౌంట్స్ కూడా లేవని, అవన్నీ ఫేక్ అని కుండబద్దలు కొట్టింది.


మరింత సమాచారం తెలుసుకోండి: