క్షేత్రస్ధాయిలో జరుగుతున్న తతంగం చూస్తుంటే అదే అనుమానం వస్తోంది. నిజానికి తెలుగుదేశంపార్టికి ప్రత్యేకించి నారా లోకేష్ కు మంగళగిరి నియోజకవర్గం ఏమాత్రం సూట్ కాదు.  ఎందుకంటే, ఇక్కడ నుండి వైసిపి తరపున పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్ది ఎంత స్ట్రాంగ్ క్యాండిడేటో అందరికీ తెలిసిందే. పోయిన ఎన్నికల్లో గెలిచింది కేవలం 12 ఓట్ల తేడాతోనే. అయితే గెలిచిన దగ్గర నుండి ఈరోజు వరకూ ఆళ్ళ విస్తృతంగా జనాల్లోనే తిరుగుతున్నారు.

 Image result for lokesh in mangalagiri

చంద్రబాబునాయుడు వ్యతిరేక పాలనపై అలుపెరుగని పోరాటాలు చేస్తూనే ఉన్నారు. రాజధాని రైతుల తరపున, సదావర్తి భూములు టిడిపి నేతలపరం కాకుండా ఆళ్ళ చేసిన పోరాటాలు అందరికీ తెలిసిందే. ఒకవైపు చంద్రబాబుపై పోరాటాలు చేస్తునే మరోవైపు సొంత ఖర్చులతో పేదలకు భోజనం పెడుతున్నారు. కేవలం 10 రూపాయలకే ఏడు రకాల కాయగూరలు, ఆకుకూరలు పంపిణీ చేస్తున్నారు. సరే ఏదో ఓ రూపంలో ప్రతీరోజు ప్రజల సమస్యలపై పోరాటాలు చేస్తునే ఉన్నారు.

 Image result for lokesh in mangalagiri

రాబోయే ఎన్నికల్లో వైసిపి కచ్చితంగా గెలుస్తుందని అనుకుంటున్న నియోజకవర్గాల్లో మంగళగిరి కూడా ఒకటి. అలాంటి నియోజకవర్గంలో టిడిపి నేతలు ఎవరు పోటీ చేసినా గెలుపు సాధ్యంకాదు. అలాంటిది ఏకంగా చినబాబు లోకేష్ నే చంద్రబాబు రంగంలోకి దింపారు. లోకేష్ ను పోటీ చేయించేందుకు చంద్రబాబు వేసుకున్న లెక్కలు ఏమిటో తెలీదుకానీ జరుగుతున్న వ్యవహారాలతో లోకేష్ మాత్రం నవ్వులపాలవుతున్నారు.

 Image result for lokesh in mangalagiri

లోకేష్ ఏమిట్లాడుతున్నారో జనాలెవరికీ అర్ధంకాదు. ఏప్రిల్ 9వ తేదీ పోలింగ్ లో తనకు ఓట్లేసి గెలిపించమని అడగటం పెద్ద జోక్ గా తయారైంది. లోకేష్ మాట్లాడుతున్నది కూడా జనాలకు అర్ధం కావటం లేదట. ప్రచారంలో వెంటకూడా పేరున్న నేతలెవరూ కనబడటం లేదు. ఇక్కడ సమస్య ఏమిటంటే లోకేష్ కు తెలీదు, ఎవరైనా చెప్పినా వినడు.  అదే సమయంలో నియోజకవర్గంలోని ప్రముఖులంతా ఆళ్ళ వెంటే ప్రచారంలో ఉన్నారు. ఆళ్ళేమో లోకల్, లోకేష్ ఏమో నాన్ లోకల్.

 Image result for lokesh in mangalagiri

సో, ఏ లెక్కలో చూసుకున్నా లాజికల్ గా మంగళగిరిలో లోకేష్ గెలిచే అవకాశాలు ఏమాత్రం కనబడటం లేదు. కాకపోతే అధికారంలో ఉండటం, ఎంత ఖర్చైనా పెట్టటానికి కావాల్సినంత అవకాశం ఉండటమే లోకేష్ కు కలిసివచ్చేది. చివరకు ఓటుకు నోటు వ్యవహారాన్నే లోకేష్ నమ్ముకున్నట్లు కనబడుతోంది. లోకేష్ మీద ఆళ్ళ రామకృష్ణారెడ్డి గెలవటం పెద్ద విశేషం కాదు. కానీ ఆళ్ళ మీద లోకేష్ గెలవమే పెద్ద వార్తవుతుంది. మరి ఓటర్లు ఏం చేస్తారో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: