అనంతపురం జిల్లాలో హిందుపురం లోక్ సభ వైసిపి అభ్యర్ధిగా నామినేషన్ వేయటానికి హై కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో మాధవ్ కు పెద్ద ఊరట లభించినట్లైంది. పోలీసు అధికారిగా ఉన్న గోరంట్ల మాధవ్ వైసిపి తరపున హిందుపురం లోక్ సభకు పోటీ చేయటానికి రెడీ అయ్యారు. అయితే, సాంకేతిక కారణాలు చూపి ప్రభుత్వం మాధవ్ రాజీనామాను తొక్కిపెట్టింది. రాజీనామా ఆమోదం పొందకపోతే మాధవ్ నామినేషన్ వేసినా చెల్లదు.

 

విధి నిర్వహణలో ఉన్నపుడు మాధవ్ పై రెండు చార్జి మెమోలు పెండింగ్ లో ఉందని చెబుతూ రాజీనామాను తొక్కిపెట్టింది. నిజానికి వైసిపి అభ్యర్ధిగా మాధవ్ పోటీ చేయటం ఖాయమైన దగ్గర నుండి టిడిపిలో ఆందోళన మొదలైంది. మాధవ్ బిసి సామాజికవర్గంలోని కురబ ఉపకులానికి చెందిన వ్యక్తి. బిసిల్లో కూడా కురబ ఉపకులస్తులు నియోజకవర్గం వ్యాప్తంగా సుమారు 5 లక్షలమందున్నారట. దాంతో మాధవ్ నామినేషన్ ను అడ్డుకునేందుకు ప్రభుత్వం చవకబారు ఎత్తులేసింది.

 

ఆ విషయాన్ని మాధవ్ ముందుగా ఊహించే ట్రైబ్యునల్ కు వెళ్ళారు. ట్రైబ్యునల్ లో మాధవ్ రాజీనామాను వెంటనే ఆమోదించి నామినేషన్ వేసేందుకు మార్గం సుగమం చేయాలని ఆదేశించింది. అయితే, అందుకు ఒప్పుకోని ప్రభుత్వం హై కోర్టుకెళ్ళింది. ఆ కేసునే ఈరోజు విచారించిన కోర్టు మాధవ్ కు లైన్ క్లియర్ చేసింది. గోరంట్ల రాజీనామాను తక్షణమే ఆమోదించాలని కూడా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ చర్యలతో వైసిపి అంటే ఎంత భయపడుతోందో అర్ధమైపోతోంది. ట్రైబ్యునల్ చెప్పినా వినని ప్రభుత్వం తాజాగా హై కోర్టు ఆదేశాలను ఏ మేరకు పాటిస్తుందో చూడాల్సిందే.

 


మరింత సమాచారం తెలుసుకోండి: