రాజకీయం అంటేనే బంధాలు, బాంధవ్యాలకు తావు లేని చోటు. వీటికి భిన్నంగా కొన్ని కొన్ని సంఘటనలు చూసినప్పుడు మన ఆలోచన తప్పు అనిపిస్తుంది. సరిగ్గా ఇలాంటి బంధమే దివంగత నేత వైఎస్సార్ రాజశేఖర్  మరియు ద్రోణం రాజులది. వైఎస్సార్ అందరితో మంచి అనుబంధాన్ని ఏర్పరచుకున్నారు. ఆయనతో బంధం ఏర్పడితే అది జీవిత కాలం అలా కొనసాగాల్సిందే. విశాఖకు చెందిన సీనియర్ నాయకుడు, ఉత్తరాంధ్ర జిల్లాలకు పెద్ద అయిన దివంగత ద్రోణంరాజు సత్యనారాయణ, వైఎస్సార్ లది  అటువంటి గొప్పబంధం.


అవి 1989లో  వైఎస్సార్ ఏపీని వదలి కడప నుంచి పోటీచేసి పార్లమెంట్ సభ్యుడైన రోజులు. అదే సమయంలో రాజ్యసభ సభ్యునిగా ద్రోణంరాజు సత్యనారాయణ డిల్లీలో చక్రం తిప్పేవారు.వారిద్దరి మధ్య బంధం చనిపోయే దాకా వీడలేదు. ద్రోణంరాజు వైఎస్సార్ ని రాజా అని ఆప్యాయంగా పిలిచేవారు. అప్పట్లో వారిద్దరి సొంత పార్టీలో ఉంటూ ప్రత్యర్థులుగా మారి ఎన్నో కార్యక్రమాలు చేశారు. విశాఖతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు వైఎస్సార్ ని పిలిచి నిరసన కార్యక్రమాలు నిర్వహించిన చరిత్ర ద్రోణంరాజుకు ఉంది. చంద్రబాబు కు వ్యతిరేకంగా కూడా వీరిద్దరూ ఎన్నో కార్య్రమాలను చెప్పట్టి శభాష్ అనిపించుకున్నారు. వైఎస్సార్  పీసీసీ చీఫ్ గా ఉండగానే ద్రోణంరాజు కుమారుడు శ్రీనివాస్ కి తొలిసారిగా 1994 ఎన్నికల్లో  పెందుర్తి టికెట్ ఇచ్చారు.


ఆ తరువాత 2004 ఎన్నికల్లో ద్రోణంరాజు అసెంబ్లీకి పోటీచేసి మంచి మెజారిటీతో గెలిచారు. వైఎస్సార్ మంత్రివర్గంలో ఆయన చేరుతారని అంతా అనుకున్నారు. తొలిదఫాలో చాన్స్ రాలేదు. తనకు తప్పక అవకాశం ఇస్తామని వైఎస్సార్ ప్రామిస్ చేసారు. అయితే ఏడాది తేడాలోనే ద్రోణంరాజు అనారోగ్యంతో చనిపోవడంతో ఉప ఎన్నికల్లో ఆ సీటుని ఆయన కుమారుడు శ్రీనివాస్ కి ఇచ్చి దగ్గరుండి గెలిపించారు వైఎస్సార్. అంతేకాదు, 2009 ఎన్నికల్లో కూడా మరోసారి శ్రీనివాస్ కి టికెట్ ఇచ్చి ఆయన విజయానికి కృషి చేశారు.వైఎస్ జగన్ కూడా తన తండ్రి బాటలోనే నడుస్తూ శ్రీనివాస్ ను పిలిచి విశాఖ సౌత్ టికెట్ ఇచ్చారు.


దీంతో శ్రీనివాస్ కాస్త భావోద్వేగానికి లోనయ్యారు. జగన్ మీద అందరూ ఎన్నో ఆరోపణలు చేస్తున్నారని, టికెట్లు అమ్ముకుంటున్నారని అంటున్నారని, అవన్నీ తప్పు అన్నారు శ్రీనివాస్. తనను పిలిచి పైసా కూడా తీసుకోకుండా టికెట్ ఇచ్చిన గొప్పతనం జగన్ దే అంటూ కళ్ల నీటి పర్యంతం అయ్యారు. తనలాంటి సామన్యుడికి ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశం ఇచ్చిన జగన్ మేలు మరువలేను అంటూ ఆయన‌ చెప్పారు.రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసిన తాను జగన్ చరిస్మా, తాను చేసిన అభివృధ్ధి పనులతో ఈసారి గెలిచి విశాఖ సౌత్ ప్రజల కోసం గట్టిగా పనిచేస్తానని చెప్పుకొచ్చారు. మొత్తానికి ద్రోణంరాజు, వైఎస్సార్ కుటుంబాల అనుబంధాన్ని చాటి చెప్పేలా జగన్ వ్యవహరించారని సర్వత్రా ప్రశంసిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: