తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాబోతున్న ఎన్నికలలో ప్రజల మనలను పొందుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికలలో నోటికి వచ్చిన హామీలను ప్రకటించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అతి తక్కువ కాలంలోనే ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొన్నారు..అంతేకాకుండా విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీల విషయంలో తన స్వార్థ రాజకీయాలను చూసుకున్న చంద్రబాబు..


రాష్ట్ర ప్రజల దృష్టిలో నేరుగా ఎన్నికల ప్రచారాన్ని ఎదుర్కొనలేక కేంద్ర ప్రభుత్వాన్ని మరియు ప్రతిపక్ష పార్టీ వైసీపీని ప్రజల దృష్టిలో వ్యతిరేకంగా చిత్రీకరించడానికి నానా ప్రయత్నాలు జరుపుతున్నారని ప్రస్తుతం జరుగుతున్న చంద్రబాబు ఎన్నికల ప్రచారాన్ని బట్టి అర్థమవుతుందని అంటున్నారు ప్రత్యర్థి పార్టీకి చెందిన కొంతమంది నాయకులు.


ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల ప్రచార మహాసభలు జరుగుతున్నా నేపథ్యంలో చంద్రబాబు మాట్లాడుతూ...రాష్ట్ర అభివృధ్ధిని రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీ వైసీపీ మరియు బిజెపి పార్టీలో అడ్డుకున్నాయని..ఇందుమూలంగా రాష్ట్రంలో  మోడీ వచ్చినప్పుడు కంటే జగన్ వచ్చినపుడు ఎక్కువ నిరసన తెలియజేయాలంటూ క్యాడర్ కి చంద్రబాబు ఇటీవల పిలుపునిచ్చినట్లు టాక్ వినపడుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: