అమ్మ పుట్టిల్లు మేనమామకు ఎరుక అన్నది సామెత. చంద్రబాబు గుట్టు అంతా మోహన్ బాబుకు తెలుసు అన్నది ఇప్పటి సామెత. మూడు రోజుల క్రితమే మోహన్ బాబు నన్ను రెచ్చగొట్టకు చంద్రబాబూ అంటూ గట్టిగానే చెప్పారు. నన్ను కదిపితే పాత విషయాలు కెలకాల్సి ఉంటుందని కూడా ఆయన చెప్పుకొచ్చారు.  ఎంటా పాత విషయాలు. ఏమా కధ...


మొత్తానికి మోహన్ బాబుని కెలకడం టీడీపీ చేసేసింది. ఆయన రిటార్ట్ అన్నట్లుగా వైసీపీ కండువా ఈ రోజు కప్పేసుకున్నారు. మీడియాతో మాట్లాడిన మోహన్ బాబు చంద్రబాబు ని ఓడిపోవాలంటూ మనసారా  దీవించేశారు. హ్యాపీగా హెల్తీగా ఉండు చంద్రబాబు అంటూ  చెప్పిన నోటితోనే ఈ ఎన్నికల్లో ఓడిపోవాలంటూ కోరుకున్నారు. జగన్ కి ఏపీలో తిరుగులేదని, ఆయనే సీఎం అవుతారని కూడా మోహన్ బాబు ధీమాగా చెప్పారు.


జగన్ పార్టీలో తాను చేరింది పదవుల కోసం కాదని కూడా మోహన్ బాబు చెప్పారు. దానికి ఓ లెక్క ఉందన్నారు. మరి ఆ లెక్క ఏంటో మోహన్ బాబు తొందరలోనే చెబుతారు. మోహన్ బాబు వైసీపీ తరఫున ఏపీ వ్యాప్తంగా తిరిగి ప్రచారం చేస్తానని చెప్పడం చంద్రబాబు కు షాక్ లాంటిదే.  మోహన్ బాబు ఆవేశపరుడు. ఉన్నది ఉన్నట్లుగా నిజాలు చెప్పేస్తే ఎన్నికల వేళ బాబుకు కొత్త చిక్కులు తప్పవు. మొత్తానికి ఈ కలెక్షన్ కింగ్ ఇపుడు బాబుకు చుక్కలు చూపించేందుకు రెడీ అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: