నారా లోకేష్  ... ముఖ్యమంత్రి తనయుడు, బాలకృష్ణ అల్లుడు, ఎన్టీఆర్ మనవుడు. ఇలా లోకేష్ అర్హతలు చాలానే ఉన్నాయి. అయితే ఈ ఐదేళ్లు లోకేష్ ఎమ్మెల్సీ ద్వారా మంత్రి పదవి చేపట్టాడు. కానీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదన్న అపనిందను మాత్రం మోస్తూ వచ్చాడు. అయితే ఎట్టకేలకు 2019 ఎన్నికల్లో పోటీ చేయడానికి మంగళగిరి నుంచి పోటీ చేయడానికి సిద్ధం అయిపోయాడు. 


అయితే నామినేషన్ దాఖలు చేయడంలో తప్పులు ఉండటంతో ఈసీ లోకేష్ నామినేషన్ పాత్రలను పక్కన పెట్టడం సంచలనం రేపుతోంది. అయితే నామినేషన్ పత్రాల్లో సాంకేతిక తప్పులను గుర్తించింది ఆళ్ల రామకృష్ణ. మంగళగిరిలో వైసీపీ అభ్యర్థి గా లోకేష్ కు ప్రత్యర్థిగా పోటీ చేస్తున్నాడు. అయితే ఇప్పటికే ఆళ్ల రామకృష్ణ కోర్టులో రైతుల భూముల కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో పిటిషన్ లు వేసి చంద్ర బాబు ప్రభుత్వానికి చుక్కలు చూపించాడు. 


అయితే ఇప్పుడు అదే విధంగా నారా లోకేష్ నామినేషన్ పత్రాల్లో తప్పులను గుర్తించి లోకేష్ కు చుక్కలు చూపిస్తున్నాడు. ఇంకా ఎన్నికల్లో పోటీ చేయకుండానే లోకేష్ ను ఖంగుతినిపించడం టాక్ అఫ్ ది టౌన్ అయ్యింది. అయితే లోకేష్ గుంటూరు పరిధిలో ఉంటూ కృష్ణా జిల్లా నుంచి తెప్పించడంతో ఈసీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఒక రోజు గడువు ఇచ్చింది. దీనితో లోకేష్ నామినేషన్ తిరస్కరణ కు గురి అవుతుందా లేదా అని ఇంకొక రోజులు తేలిపోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: