సొంత జిల్లా చిత్తూరుపై పట్టు సాధించేందుకు చంద్రబాబునాయుడు నానా అవస్తలు పడుతున్నారు. అవటానికి సొంత జిల్లానే అయినా చంద్రబాబు ఏనాడూ చిత్తూరుపై పట్టు సాధించిం లేదనే చెప్పాలి.  కాంగ్రెస్ కు కడప జిల్లాపై ఒకపుడు బ్రహ్మాండమైన పట్టుండేది. కేవలం వైఎస్ కుటుంబం వల్లే కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయాలు సాధించేది. వైఎస్ మరణం, రాష్ట్ర విభజన తర్వాత వైసిపి ఏర్పాటైంది.

 

2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ హవా మొత్తం వైసిపి బదిలీ అయ్యింది. అందుకే జిల్లాలోని 10 సీట్లలో టిడిపికి దక్కింది కేవలం ఒక్కసీటు మాత్రమే. కడపలో వైఎస్ కుటుంబానికి దక్కినట్లుగా చంద్రబాబుకు ఏనాడు జిల్లాలో ఆధిపత్యం దక్కలేదు. నిజానికి ఈ జిల్లాలో మొదటినుండి కాంగ్రెస్ దే హవా. ఎప్పుడు ఎన్నికలు జరిగినా మెజారిటీ సీట్లు కాంగ్రెసే గెలిచేది.

 

1994లో జరిగిన ఎన్నికల్లో మాత్రం ఎన్టీయార్ ప్రభంజనంలో జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో 14 స్దానాల్లో గెలిచింది. తర్వాత ఎన్టీయార్ వెన్నుపోటు తర్వాత పార్టీ మొత్తం చంద్రబాబు చేతిలోకి వచ్చేసింది. చంద్రబాబు నాయకత్వంలో టిడిపి నాలుగు ఎన్నికలను ఫేస్ చేసింది. ఏ ఎన్నికలో కూడా ఆధిపత్యం సాధించలేకపోయింది. ఇక రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో కూడా వైసిపిదే ఆధిపత్యం. జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో వైసిపి 8 సీట్లలో గెలిస్తే టిడిపి 6తో సరిపెట్టుకుంది.

 

ఇక ప్రస్తుత విషయానికి వస్తే ఏమవుతుందనేది సస్పెన్సుగా మారింది. ఓ అంచనా ప్రకారమైతే రాబోయే ఎన్నికల్లో వైసిపి 12 సీట్లు గెలుస్తుందని అంటున్నారు. కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో మాత్రమే టిడిపి గెలుస్తుందని చెబుతున్నారు. కుప్పంలో గ్యారెంటీగా చంద్రబాబు గెలుస్తారట. వైసిపి ప్రభంజనం ఉంటే పలమనేరులో ఫిరాయింపు మంత్రి అమరనాధరెడ్డి కూడా గెలిచేది అనుమానమే అంటున్నారు.

 

ఓ అంచనా ప్రకారం తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, పూతలపట్టు, నగిరి, చంద్రగిరి, పీలేరు, పుంగనూరు, తంబళ్ళపల్లి, మదనపల్లి, గంగాధర నెల్లూరులో వైసిపికి స్పష్టమైన ఆధిక్యతుందని సమాచారం. అలాగే కుప్పంలో చంద్రబాబు గెలుపు ఖాయం. ఇక పలమనేరు, చిత్తూరులో మాత్రం గట్టిపోటి ఉంటుందంటున్నారు. అంటే రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకు జిల్లా పెద్ద షాకే ఇచ్చేట్లుంది చూడబోతే.


మరింత సమాచారం తెలుసుకోండి: