ప్రముఖ రాజకీయ విశ్లేషకురాలు జ్యోత్స్న ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రాబోయే ఎన్నికలు హోరా హోరీగా జరగనున్నట్లు తెలిపారు. అయితే ముందుగా బాబు మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం అనుకున్న తరుణంలో తాజా పరిస్థితులు జగన్ కు లభిస్తున్నాయి అని అన్నారు.

ముందుగా పవన్ కళ్యాణ్ తాను ప్రశ్నిస్తా అని చెప్పి చంద్రబాబు ని వదిలేసి జగన్ పైన పడడం జగన్ కు లభించే విషయం గా చెప్పుకొచ్చారు. తరువాత ప్రత్యేక హోదా పైన బాబు "యూ" టర్న్ తీసుకొని ప్రజల విశ్వసనీయత కోల్పోయారని ఆమె అన్నారు. ఇక పోతే వివేకానంద రెడ్డి మరణంలో బాబు ప్రదర్శించిన అత్యుత్సాహం కూడా జానాలను జగన్ వైపు మొగ్గచూపుతున్నారు అని పేర్కొన్నారు.

జగన్ మాత్రం ప్రాణాలికా బద్దంగా తన కార్యాచణలో సఫలమయ్యారు అని ఆమె భావించారు. ఇక పోతే గత నాలుగైదు నెలల్లో చంద్రబాబు తాను విస్మరించిన సెక్టార్ జనాన్ని, హామీలను అమలు పరచడం కూడా అతనికి మైనస్ పాయింట్స్ గా పేర్కొన్నారు. మొత్తానికి ఇప్పుడు అంతా జగన్ వేవ్ కనపడుతున్నా బాబు అనుభవం, పవన్ దూకుడు కలగలిసి జగన్ అవకాశాలు సన్నగిల్లి మొత్తానికి ఇదొక రసకందాయంలో పడింది అని ఆమె అభిప్రాయపడ్డారు.


మరింత సమాచారం తెలుసుకోండి: