టీడీపీ పార్టీని స్థాపించి ముప్పై ఏళ్ళు దాటిపోయింది. రాజకీయాల్లో చంద్రబాబుకు  ఏకంగా 40 ఏళ్ల అనుభవం ఉంది. దేశ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయనాయకుడు చంద్రబాబే అందులో ఎవరికీ ఎటువంటి సందేహం లేదు. అయితే 9 ఏళ్ల క్రితం పుట్టిన పార్టీ అయినా వైసీపీ .. జగన్ నాయకత్వంలో చంద్రబాబు గట్టి పోటీ ఇచ్చే పార్టీగా ఎదిగింది. జగన్ వయసు .. చంద్రబాబు తో పోలిస్తే అతని అనుభవం అంత  కూడా ఉండదు. 


అయితే  జగన్ ఎదిగిన తీరు చంద్రబాబుకు ప్రత్యర్థి గా మారిన తీరు .. ఎవరైనా మెచ్చుకోవాల్సిందే. అయితే చంద్రబాబు కానీ, టీడీపీ నాయకులూ .. జగన్ ను టార్గెట్ చేసిన విధానం కొంచెం హేయనీయంగా ఉంటుంది. అందులో మొదటిగా చెప్పాల్సిన పేరు అనంతపురం ఎంపీ ... జేసి దివాకర్ రెడ్డి . ఇతను అయితే ఏకంగా సభల్లో నా కొడకా అని జగన్ ను భూతులు తిట్టిన రోజులు కూడా ఉన్నాయి. తరువాత లిస్ట్ లో ఆది నారాయణ రెడ్డి .. వైసీపీ లో గెలిచి టీడీపీ లోకి జంప్ అయ్యి జగన్ ను బాగా టార్గెట్ చేశారు. 


అయితే జగన్ అధికారం లోకి వస్తే ఖచ్చితంగా వీరిద్దరిని జగన్ టార్గెట్ చేస్తాడని ఇక చుక్కలేనని వినిపిస్తున్నాయి. నిజానికి వీరికే కాదు చంద్రబాబు .. ఆ పార్టీ నేతలందిరికి జగన్ అధికారంలోకి వస్తే తమను టార్గెట్ చేస్తాడని కేసులు పెట్టిస్తాడని భయపడుతున్నట్టు భోగట్టా. అంతెందుకు ఇప్పటికే పవన్ కూడా చెప్పాడు. జగన్ అంటే టీడీపీకి భయమని ఏకంగా .. చంద్రబాబు కూడా తన భయాన్ని బయట పెట్టాడని చెప్పుకొచ్చాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: