లక్ష్మీస్ ఎన్టీయార్ బయోపిక్ అంటే చంద్రబాబునాయుడు అండ్ కో ఎందుకు ఉలికిపడుతున్నారు ? అప్పట్లో ఎన్టీయార్ ను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పదవిలో నుండి దింపేసిన విషయం ఇప్పటి జనాలకందరికీ తెలుస్తుందనా ?  సరిగ్గా ఎన్నికలకు ముందు  బయోపిక్ లో చంద్రబాబు పాత్ర నిజమే అని జనాలు అనుకుంటే తమకు ఓట్లు పడవని టిడిపి నేతలందరూ ఆందోళన పడుతున్నారా ?

 

అప్పటి ఎన్టీయార్ వెన్నుపోటుకు చంద్రబాబు అండ్ కో పెట్టుకున్న ముద్దుపేరు  అధికార మార్పిడి. చంద్రబాబు అండ్ కో ఏమి పేరు పెట్టుకున్నా జనాలు మాత్రం దాన్ని వెన్నుపోటనే చెప్పుకున్నారు. నిజానికి వెన్నుపోటు ఘటన జరిగి దాదాపు 25 ఏళ్ళవుతోంది. అయినా ఆనాటి ఘటన గురించి ఈనాటి యువతకు తెలిసింది తక్కువనే చెప్పుకోవాలి. అలాంటిది బయోపిక్ రిలీజును టిడిపి నేతలు ఇంతగా అడ్డుకుంటున్నారంటే అందుకు కారణం వారిలో టెన్షనే అని తెలిసిపోతోంది.

 

ప్రపంచవ్యాప్తంగా శనివారం రిలీజవ్వాల్సిన  లక్ష్మీస్ ఎన్టీయార్ ఏపిలో మాత్రం రిలీజు కావటం లేదు. ఏప్రిల్ 3వ తేదీన న్యాయమూర్తి ఛాంబర్లో సినిమాను చూసిన తర్వాత రిలీజు విషయంలో నిర్ణయం తీసుకుంటారట. వివాదం న్యాయస్ధానం మెట్లెక్కిందంటే చంద్రబాబు గుప్పిట్లో నుండి తప్పించుకోవటం కష్టమనే భావన పెరిగిపోతోంది. ఎందుకంటే, న్యాయవ్యవస్ధపై చంద్రబాబుకున్న పట్టలాంటిది.

 

లక్ష్మీస్ ఎన్టీయార్ బయోపిక్ ఫష్ట్ హాఫ్ లో లక్ష్మీపార్వతి పాత్ర ప్రవేశం, వివాహం, ఎన్నికల ఘట్టాలుంటాయట. ఇక సెకెండ్ హాఫ్ లో ఎన్టీయార్ ను పదవిలో నుండి దింపేయటం, వైశ్రాయ్ ఎపిసోడ్, అనారోగ్యం, తర్వాత ఎన్టీయార్ మరణంతో సినిమా ముగుస్తుందట. అంటే సెకెండ్ హాఫ్ వల్లే టిడిపికి బాగా డ్యామేజ్ జరుగుతుందని భయపడుతున్నారట. అందుకనే ఎక్కడికక్కడ బయోపిక్ రిలీజ్ కాకుండా అడ్డుకుంటున్నారు. మరి ఈ ప్రభావం రేపటి ఎన్నికలపై ఎలాగుంటుందో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: