ఏపీలో లోపాయికారి పొత్తులు ఉన్నాయని అంతా వూహిస్తున్న సంగతి విధితమే. తెల్లారిలేస్తే వైసీపీ నాయకులు చంద్రబాబు పార్టనర్ పవన్ అంటూ విమర్శలు చేస్తున్నారు. దానికి ఆధారంగా ఎన్నో విషయాలు కూడా కళ్ళ ముందు కనిపిస్తున్నాయని అంటున్నారు. 


ఇపుడు ఏకంగా ఓ టీడీపీ నేత మాట్లాడుతూ పవన్ మనం ఒక్కటేనని చెప్పడం చూస్తే ఈ బంధం ఫెవికాల్ లాంటిదని అర్ధమైపోతోంది. ..తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలోని  రాష్ట్ర గిడ్డంగుల సంస్థ డైరెక్టర్, టీడీపీ నేత మెట్ల రమణబాబు నివాసంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ఇద్దరూ ఇప్పుడు కలిసే ఉన్నారు. వారిద్దరూ ఒక అవగాహనతోనే ఉన్నారు. జనసేన నాయకులు, కార్యకర్తలకు ఈ విషయాన్ని చెప్పాలి’ అని పిలుపునిచ్చారు.  రమణబాబు అలా చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ మధ్య ఉన్న బంధాన్ని వివరించారు.


జనసేనలో కాపు యువత కావచ్చు లేదా వేరే యువత కావచ్చు..జనసేన అన్నప్పుడు మనం వివరించి చెప్పాలి. వారందరికీ ఒకటే విషయాన్ని చెప్పండి..మీ ఓటు వృథా చేయవద్దు.. ఈ సారికి ఇలా చేయండి.. తర్వాత పవన్‌కల్యాణ్‌కు ఇంకా వయస్సు ఉంది. భవిష్యత్‌ ఉంది.. ఆయన సంగతి అప్పుడు అలోచిద్దాం’ అని చెప్పండని రమణబాబు పార్టీ నాయకులకు సూచించారు. ‘ఎందుకంటే చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌  బద్ధశత్రువులుగా లేరు. గతంలో మధ్యలో చిన్న డిస్ట్రబెన్స్‌ క్రియేట్‌ అయిందే తప్ప వారిద్దరి మధ్య ఏ విధమైన పొరపచ్చాలు లేవు. ఇప్పుడు కూడా ఇద్దరూ కలిసే ఉన్నారు. ఇదే విషయాన్ని జనసేన నాయకులు, కార్యకర్తలకు చెప్పండని’ వివరించారు.


 దీని భావమేంటంటే ఈసారికి చాన్స్ పవన్ తీసుకోకుండా కొన్ని సీట్లతో సరిపెట్టుకుని బాబుని సీఎం చేస్తారన్న మాట. ఇద్దరి ఉమ్మడి శత్రువు జగన్ అధికారంలోకి  రాకుండా నిరోధిస్తారన్న మాట. ఈ తెర వెనక ఒప్పందం ఇలా రట్టు అయిపోవడం రెండు పార్టీలకు ఇబ్బందికరమే. మరి దీని మీద జనసెన ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: