ఐపిఎస్ అధికారుల బదిలీ విషయంలో ఎన్నికల కమీషన్ దే అంతిమ నిర్ణయంగా హై కోర్టు తేల్చేసింది.  కాబట్టి ఈసి నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకునేది లేదని తేల్చేసింది. హైకోర్టు తాజా వ్యాఖ్యలతో చంద్రబాబునాయుడు దిమ్మ తిరిగినట్లైంది. ఎన్నికల ప్రక్రియ నుండి ఐబి ఛీఫ్ ఏబి వెంకటేశ్వరరావుతో పాటు మరో ఇద్దరు ఎస్పీలను బదిలీ చేస్తు ఈసి నిర్ణయించిన సంగతి అందరికీ తెలిసిందే.

 

ఈసి ఆదేశాల ప్రకారం ప్రభుత్వం ముందు ముగ్గురిని రిలీవ్ చేస్తు జీవో జారీ చేసింది. అయితే మరుసటిరోజు తెల్లారేసమయానికి సీన్ మారిపోయింది. ఇద్దరు ఎస్పీల బదిలీకి ఓకే చెప్పిన చంద్రబాబు ఐబి ఛీఫ్ బదిలీని మాత్రం అడ్డుకున్నారు. ముందురోజు ఇచ్చిన జీవోను రద్దు చేశారు. ఐబి ఛీఫ్ బదిలీ అన్నది ఈసి పరిధిలోకి రాదంటూ అడ్డుగోలుగా వాదనలు మొదలుపెట్టారు. ఈసి పరిధితో పాటు అధికారులను ప్రశ్నిస్తూ ఏకంగా హై కోర్టులో కేసు కూడా వేశారు.

 

ఆకేసుపైనే విచారణ జరిపిన కోర్టు చివరకు చంద్రబాబుదే తప్పన్నట్లుగా తీర్పిచ్చింది. ఎన్నికల సమయంలో ఎవరినైనా సరే బదిలీ చేసే అధికారం ఈసికి ఉందన్నట్లుగా కోర్టు సమర్ధించింది. అందుకే ఈసి నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకునేది లేదంటూ స్పష్టంగా తేల్చేసింది. ముందు ముగ్గురిని రిలీవ్ చేస్తు ప్రభుత్వం జీవోను విడుదల చేస్తు మరుసటి రోజు ఎందుకు సవరించుకున్నదనే ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోయింది. అలాగే ఐబి ఛీఫ్ కూడా ఎన్నికల ప్రక్రియలో ఓ భాగమే కాబట్టి ఆయన ఈసి పరిధిలోకి రారని ప్రభుత్వం చేసిన వాదనను కోర్టు కొట్టేసింది. దాంతో చంద్రబాబుకు దిమ్మ తిరిగింది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: