జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా ఇటీవల ఓ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక రాజకీయ విశేషాలు గురించి మరియు ప్రజల గురించి తాను చేయబోయే కార్యక్రమాల గురించి సంచలన విషయాలు పంచుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతటా ఎన్నికల వాతావరణం అలుముకుంది.


గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉన్న పవన్ కళ్యాణ్ రాబోతున్న ఎన్నికలలో వామపక్ష పార్టీలతో కలిసి పోటీ చేసిన నేపథ్యంలో మొదటిసారి పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా రెండు నియోజకవర్గాలలో నిలబడి అసెంబ్లీకి పోటీ చేస్తున్న క్రమంలో పవన్ కళ్యాణ్ పొలిటికల్ భవిష్యత్తు గురించి సినిమా రంగంలోనూ రాజకీయ రంగంలోని అనేక కామెంట్లు చేస్తున్నారు.


ఈ నేపథ్యంలో త్వరలో ఎన్నికలు జరుగనున్న ఈ క్రమంలో ఓ ప్రముఖ టీవీ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ...మన పార్టీలో పోరాడే వారే ఎక్కువగా ఉండాలని అది ముందునుండి కోరుకున్నానని ...నేను చేసే యుద్ధం కేవలం ప్రస్తుతానికి సంబంధించినది కాదు ఎంత పోరాటం చేయవలసి ఉంటుంది అందుకే పార్టీ పెట్టిన నాటి నుండి పెద్ద ఇప్పుడే అద్భుతాలు జరగాలని పెద్దగా ఆలోచించలేదు అంటూ ఓ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: