అన్న గారి జీవితం పూల పానుపు అది సినిమా రంగంలో, రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్ళలో. కానీ ఆయన ఓసారి సీఎం పదవి కోల్పోయాక మాత్రం అసలైన అన్న గారి జీవితం ప్రారంభమైంది. ఇక ఆయన ద్వితీయ  వైవాహిక జీవితం, రెండవ భార్య లక్ష్మీ పార్వతి, కుటుంబ సభ్యుల చీత్కారాలు, మరో వైపు జనాల ఆదరణ, బంపర్ మెజారిటీతో మళ్ళీ  అన్న గారు ముఖ్యమంత్రి కావడం ఇదంతా ఓ చరిత్ర.


ఆ తరువాత ఆయన్ని పదవీచ్యుతున్ని చేయడానికి సొంత అల్లుడే ఇతర కుటుంబ సభ్యులతో కలసి అంతపుర రాజకీయం నడపడం, చివరికి వైస్రాయ్ ఎపిసోడ్ తో అన్న గారు వెన్నుపోటుకు గురి కావడం, ఆయన మీద ఏకంగా చెప్పులు వేయించి తీవ్ర పరాభవం చేయడం వంటివి ఈనాటి తరానికి తెలియని కఠిన సత్యాలు. కుటుంబం మొత్తం దూరమై, అవమానకరంగా పదవి నుంచి దిగిపోయిన అన్న గారు చివరకు దారుణమైన పరిస్థితుల్లో మరణించడం అన్నది తెలుగు జాతి పై ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం.


ఈ రోజు అన్న గారు తెలుగుదేశం పార్టీని ప్రకటించిన రోజు. సరిగ్గా ఇదే రోజున లక్ష్మీస్ ఎంటీయార్ మూవీని రాం గోపాల్ వర్మ రిలీజ్ చేశారు. ఈ ఏపీ కాకుండా తెలంగాణా సహా మిగిలిన చోట్ల విడుదలైన ఈ మూవీకి  తొలి ఆట నుంచే మంచి రెస్పాన్స్ రావడం మారుతున్న ఏపీ రాజకీయ పరిణామాలకు ఒక సూచికగా భావించాలి. అన్న గారు పేరు చెప్పుకుని పదవుల్లోకి వచ్చిన వారు. కన్న వారు, సొంత అల్లుడు చంద్రబాబు చివరకు ఆయన్ని వెన్నుపోటు ఎలా పొడిచాడన్నది ఈ మూవీలో చూపించడం ఎన్నికల వేళ బాబు పార్టీకి ఇబ్బందికరమే. 


ఈ మూవీ హిట్ టాక్ తో ఇపుడు టీడీపీ కూసాలు కదిలిపోయే ప్రమాదమైతే వచ్చినట్లుగానే భావించాలి. ఇపుడు ఓటు వేయబోతున్న యువ ఓటర్లు చంద్రబాబు ఆయన పార్టీ అన్న గారికి చేసిన ద్రోహాన్ని కనుక చూస్తే ఎలా ఆలోచిస్తారో అన్నది కూడా చూడాలి. ఏది ఏమైనా లక్ష్మీస్ ఎంటీయా  ప్రభావం చాలానే ఉంటుందని తెలుస్తోంది. ఈ మూవీ ఏపీలో ఇవాళ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కోర్టు ఆదేశాలపై ఇంజెక్షన్ ఆర్డర్లు తెప్పించాలనుకుంటున్నారు. ఏపీలో ఈ మూవీ విడుదల అయితే ఉంటుంది అసలైన పొలిటికల్ వార్.


మరింత సమాచారం తెలుసుకోండి: