ప్రముఖులు మహామహులు పోటీ చేసిన లోక్ సభ నియోజకవర్గం బాపట్ల. ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడు ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ తరుపున గతంలో పోటీ చేయడం విశేషం. అలాగే సినీ దిగ్గజం రామానాయుడు కూడా ఈ నియోజకవర్గంలో ప్రాతినిథ్యం వహించారు. గుంటూరు ప్రకాశం జిల్లాలో విస్తరించిన బాపట్ల నియోజవర్గం ప్రస్తుతం ఎస్సీ రిజర్వుడు స్థానంగా ఉంది. కొన్ని ఏళ్లు  కాంగ్రెస్ 2014లో టీడీపీ వశమైన ఈ నియోజకవర్గంలో ఈసారి  టీడీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ శ్రీరాం మల్యాద్రి మరోసారి పోటీ చేస్తుండగా వైసీపీ నుంచి యువకుడైన నందిగం సురేశ్ బరిలో ఉన్నారు.

1977లో బాపట్ల లోక్ సభ స్థానానికి తొలిసారిగా ఎన్నిక జరిగింది. ఇదే నియోజకవర్గం నుంచి 1989లో బీజేపీ నుంచి పోటీ చేసిన వెంకయ్యనాయుడు ఓడిపోయారు. 2009 నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా బాపట్ల లోక్సభ నియోజకవర్గాన్ని ఎస్సీ రిజర్వుడుగా మార్చారు. ఆ వెంటనే కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పనబాక లక్ష్మి గెలుపొందారు. 2014లో టీడీపీ నుంచి శ్రీరాం మాల్యాద్రి గెలుపొందారు. ప్రస్తుతం ఆయనే పోటీ చేస్తున్నారు. మాజీ ఐఆర్ఎస్ అధికారి అయిన శ్రీరాం మాల్యాద్రి 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలుపొందారు. అయితే ఆయన  నియోజకర్గానికి చాలా తక్కువ సమయంలో వచ్చారన్న ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి.

ఉద్దండ్రాయినిపాలేం ప్రాంతానికి చెందిన నందిగం సురేశ్ వైసీపీలో తొలుత యువజన విభాగం నాయకుడిగా పనిచేశాడు. ఆ తరువాత ఆయనకు పార్టీ అధిష్టానం నియోజకవర్గ బాధ్యతలను అప్పగించింది. దీంతో ఆయన కార్యకర్తల సహకారంతో నియోజకవర్గంలోని ప్రజలకు దగ్గరవుతూ వస్తున్నాయి. వైసీపీ టికెట్ కేటాయించడంతో తన ప్రచారాన్ని మరింత ఉధృతం చేశారు. స్థానికుడు కావడం, యువకుడు కావడంతో ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు.  అటు జగన్ సంకల్ప యాత్ర చేసినప్పుడు ఆయన జనసమీకరణ చేయడంలో సఫలీకృతుడయ్యారు. ఇదే వైసీపీ అభ్యర్థి గెలుపు అవకాశాలను పెంచుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: