పరువు పోయిన తర్వాత, చేసేదేమీ లేక చంద్రబాబునాయుడు ఐబి చీఫ్ వెంకటేశ్వరరావును బదిలీ చేశారు. ఎన్నికల ప్రక్రియ నుండి ఐబి చీఫ్ ఏబి వెంకటేశ్వరరావుతో పాటు మరో ఇద్దరు ఐపిఎస్ అధికారులను ఎన్నికల విధుల నుండి తప్పిస్తు కేంద్ర ఎన్నికల కమీషన్ బదిలీ చేసిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం జారీ అయిన ఈసి బదిలీ ఉత్తర్వులను చంద్రబాబు సర్కార్ సవాలు చేసింది.

 

ఈసీ ఉత్తర్వులు రాగానే ముందేమో ముగ్గురు ఉన్నతాధికారులను బదిలీ చేస్తు ప్రభుత్వం జీవో రిలీజ్ చేసింది. మరుసటి రోజు మాత్రం అడ్డం తిరిగింది. ఇద్దరు ఎస్పీల బదిలీకి ఓకే చెప్పిన చంద్రబాబు ఐబి చీఫ్ బదిలీని మాత్రం అడ్డుకున్నారు. ఐబి చీఫ్ కు ఎన్నికలకు సంబంధం లేదని, అసలు ఐబి చీఫ్ ఈసి పరిధిలోకే రారనే వితండ వాదన మొదలుపెట్టారు.

 

నిజానికి చంద్రబాబుకు కళ్ళు, ముక్కుగా వెంకటేశ్వరరావు పనిచేస్తున్న విషయం తెలిసిందే. అధికార పరిధిని దాటి చంద్రబాబు సొంత మనిషిగాను, పార్టీ నేతగానో వెంకటేశ్వరరావు వ్యవహరిస్తున్నారంటూ వైసిపి నేతలు ఎప్పటి నుండో ఆరోపణలు చేస్తున్న విషయం చూస్తునే ఉన్నారు. ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత ఆయన సేవలు మరింత ఎక్కువయ్యాయి. అందుకనే వైసిపి ఫిర్యాదు చేసింది.

 

ఆ పిర్యాదు మేరకే ఈసి స్పందించి పై ముగ్గురిని బదిలీ చేసింది. ఇక్కడే చంద్రబాబుకు ఒళ్ళు మండిపోయింది. అంటే వెంకటేశ్వరరావు లేకపోతే రాజకీయం చేయలేని పరిస్ధితికి చంద్రబాబు దిగజారిపోయారు. అందుకనే ఈసి ఉత్తర్వులను సవాలు చేస్తు కోర్టుకెళ్ళారు. చివరకు కోర్టులో చంద్రబాబుకు బాగా మొట్టికాయలు పడ్డాయి. చీఫ్ సెక్రటరి, డిజిపి నుండి కానిస్టేబుల్ వరకూ ప్రతీ ఒక్కళ్ళు ఈసి పరిధిలోకి వచ్చేటపుడు డిజిపికన్నా క్రిందస్ధాయి అధికారి మాత్రం ఎందుకు రారు ?

 

అదే ప్రశ్న ఈసి, వైసిపి తరపు లాయర్లు అడిగినపుడు ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోయింది. దాంతో కోర్టుకు విషయం అర్ధమైపోయింది. అందుకనే ఈసి అధికారాల్లో తాము జోక్యం చేసుకోమని చెప్పింది. అంతేకాకుండా ఈసి ఉత్తర్వుల ప్రకారం ఐబి చీఫ్ ను బదిలీ చేయాల్సిందేనంటూ గట్టిగా ఆదేశించింది. దాంతో వేరే దారిలోక, చేసేది లేక వెంకటేశ్వరరావును ఆగమేఘాల మీద బదిలీ చేస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదేదో ముందే చేసుంటే కనీసం ప్రభుత్వం పరువైనా మిగిలుండేది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: