చంద్రబాబు నాయుడు 2014 కు ముందు సుమారుగా 9 ఏళ్ళు పరిపాలించారు. అయితే ఆ 9 ఏళ్లలో రాష్ట్రం భయంకరమైన కరువుతో అల్లాడి పోయింది. దానికి తగ్గట్టు అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో రైతులు నానా అవస్థలు పడ్డారు. అయితే అదేంటో కానీ తరువాత 2004 లో రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో వర్షాలు బాగా కురిశాయి. 


అప్పటి నుంచి అదొక సెంటిమెంట్ గా ఉండి పోయింది. చంద్రబాబు అధికారంలోకి వస్తే వర్షాలు రావని అన్ని కరువులేనని. అప్పట్లో రాజశేఖర్ రెడ్డి కూడా మాట్లాడుతూ చంద్రబాబు ఉంటే వరుణ దేవుడు కరుణించిండని సెటైర్లు వేసేవారు. అయితే చాలా మంది రైతుల్లో కూడా అటువంటి సెంటిమెంట్ బలంగా నిలిచిపోయింది. చంద్రబాబు అధికారంలో అడుగు పెడితే వర్షాలు పడవని అంటుంటారు. 


అయితే తాజాగా ఓక్ రైతు మాట్లాడుతూ చంద్రబాబు 2014 లో అధికారంలోకి వచ్చిన తరువాత వర్షాలు పడలేదని, వరదలు వచ్చిన రైతులు తట్టుకోగలరని వర్షాలు రాకపోతే కష్టమని చెప్పుకొచ్చాడు. ఇంకా చెబుతూ వర్షాలు , వాతావరణం అంతా అనుకూలించడం అనేది పరిపాలించే రాజు మీద కూడా ఆధార పడి ఉంటుందని ఈ సారి జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని సెలవిచ్చాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: