ప్రియాంకా గాంధీ  కాంగ్రెస్ పార్టీ కార్య‌ద‌ర్శిగా ఇటీవ‌ల బాధ్య‌త‌లు స్వీక‌రించిన విష‌యం తెలిసిందే. లోక్‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో.. ప్రియాంకా పూర్తి స్థాయి ప్ర‌చారం చేప‌ట్ట‌నున్నారు. ఇలా కీల‌క బాధ్య‌త‌లు మోస్తున్న ప్రియాంకా గాంధీ ఇవాళ అయోధ్యలో ప‌ర్య‌టించారు. ప్ర‌ధాని మోదీపై ఆమె తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ప్ర‌ధాని మోదీ త‌న ప్ర‌త్యేక‌త‌గా చెప్పుకొనే కౌగిలింత‌ల‌పై పంచ్‌లు వేశారు.


అయోధ్య‌లోని స్థానికుల‌తో అనుసంధానం అయిన ప్రియాంక వార‌ణాసి నియోజ‌క‌వ‌ర్గంలోని గ్రామాల‌ను ప్ర‌ధాని మోదీ విజిట్ చేశారా అని ఆమె స్థానికులను ప్ర‌శ్నించారు. గ్రామాల్లోకి మోదీ రాలేద‌ని స్థానికులు స‌మాధానం ఇచ్చారు. ప్ర‌జ‌లు ఇచ్చిన స‌మాధానం త‌న‌న‌కు ఆశ్చర్యానికి గురి చేసింద‌ని ప్రియాంకా అన్నారు. మోదీ ప్ర‌పంచం అంతా తిరిగారు, ఎవ‌రెవ‌ర్నో హ‌త్తుకున్నారు, కానీ స్థానిక నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌ను మాత్రం మోదీ ఆలింగ‌నం చేసుకోలేక‌పోయారు అని ప్రియాంకా విమ‌ర్శించారు. 


ఇదిలాఉండ‌గా, ఇటీవ‌ల స్టీమ‌ర్ బోటు ద్వారా ఆమె గంగా యాత్ర నిర్వ‌హించారు. మొత్తం మూడు రోజుల పాటు 140 కిలోమీట‌ర్ల దూరం ఆమె ప్ర‌యాణించారురు. గంగా న‌ది వెంట ఉన్న గ్రామాల్లో ఆమె ప్ర‌చారం చేప‌ట్టా. ఈనెల 18వ తేదీన ప్ర‌యాగ్‌రాజ్‌లో ఈ ప‌ర్య‌ట‌న మొద‌ల‌యింది. వార‌ణాసిలో ప్రియాంక పోటీ చేయ‌నున్నార‌నే వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: