పవన్ కళ్యాణ్ నాలుగేళ్లు టీడీపీ ప్రభుత్వం బాగుందని ఆ పార్టీకి కితాబు ఇస్తూ రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతూ వచ్చాడు. తరువాత ఒక్క సారిగా యూ టర్న్ తీసుకోని నేను ..చంద్రబాబుకు మద్దతు ఇచ్చి తప్పుచేశాను. టీడీపీ ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోతుంది అని కొత్త డ్రామాకు తెరదించాడు. అప్పటి నుంచి టీడీపీ మీద విమర్శలు చేయడం మొదలెట్టాడు. ఇది నిజంగా ప్రజలను మోసం చేయడం కాక మరేంటి ..?


2014 ఎన్నికలకు టీడీపీ ని గెలిపించండి హామీల భాద్యత నాదేనని ఆవేశంగా చెప్పిన పవన్..  నాలుగేళ్లు చంద్రబాబును పొగిడి ఎన్నికల ముందు బయటికొచ్చి కొత్త డ్రామాను మొదలుపెట్టిన పవన్ ఇప్పుడు మరలా జగన్ ను మాత్రమే విమర్శించడం ఎలా అర్ధం చేసుకోవాలి. ఎవరైనా అధికారంలో ఉన్న ప్రభుత్వం మీద విమర్శలు చేస్తారు. కానీ పవన్ గారు మాత్రం చంద్రబాబు ను పట్టించుకోవటం మానేసి జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. 


అయితే ఇప్పుడు జనసేన -టీడీపీ తెర వెనుక బాగోతం ఏకంగా టీడీపీ నేత మెట్ల రమణ చెప్పకనే చెప్పాడు. ఒక సభలో మాట్లాడుతూ జనసేన నాయకులకు, కార్యకర్తలకు చెప్పండి. ఈ సారి టీడీపీకి ఓటేయమని, పవన్ గారికి ఇంకా చాలా సమయం ఉంది. పవన్ కు  చంద్రబాబు కు అప్పుడప్పడూ పేచీ వచ్చింది కానీ ఇప్పుడే ఒక్కటేనని సెలవిచ్చారు. దీనితో వీరి తెర వెనుక మ్యాచ్ ఫిక్సింగ్ ఏకంగా టీడీపీ నేత మాట్లాడటంతో ఇప్పుడు ప్రజలకు ఒక క్లారిటీ వచ్చింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: