ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు త‌న త‌న‌యుడు, రాష్ట్ర మంత్రి లోకేష్ విష‌యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారా?  తెలుగుదేశం పార్టీ వ‌ర్గాల ప్ర‌కారం ఇది ముఖ్య‌మైన సూచ‌న అయితే, విప‌క్షాల విశ్లేష‌ణ‌ ప్ర‌కారం `లోకేష్‌కు వార్నింగ్` ఎలా  అయింది? ఇది ప్ర‌స్తుతం ఏపీలో జ‌రుగుతున్న హాట్ హాట్ చ‌ర్చ‌. లోకేష్ విష‌యంలో సీఎం చంద్ర‌బాబు తీసుకున్న నిర్ణ‌యం ఫ‌లితం. 


ముఖ్యమంత్రి కొడుకు అంటే ఒక రకమైన క్రేజ్ ఉంటుంది. కానీ ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం చంద్రబాబు కొడుకు, మంత్రి లోకేశ్ అంటే మాత్రం అభ్యర్థులు వణికిపోతున్నారు. లోకేష్‌తో ప్రచారం చేయించుకుంటే, అసలుకే ఎసరు అంటూ తప్పుకుంటున్నారు. టీడీపీ యువ‌నేత లోకేష్ ప్ర‌సంగాలు సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. కడప, గుంటూరు, విశాఖ జిల్లాల్లో లోకేష్‌ ప్రచారంలో వివేకానందరెడ్డి మరణంతో పరవశించాను.. మచిలీపట్నం పోర్టును తెలంగాణకు తీసుకుపోయేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు.. గతంలో చూసేవాళ్లం.. ఊం.. ఆ అంటే.. ంగు వచ్చేది, మలేరియా వచ్చేది.. అంటూ బూతు పదాన్ని ఉచ్ఛరించిన మంత్రి లోకేష్ ప్ర‌సంగం అంటేనే పార్టీ నేతలు వణుకుతున్నారు. ప్రసంగాలు విన్న జనం జంకుతున్నారు. ఈ నేప‌థ్యంలో టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు కీల‌క హెచ్చ‌రిక చేసిన‌ట్లు స‌మాచారం.  


నేడు కర్నూల్ జిల్లాలో ఓ మంత్రి నియోజకవర్గంలో మంత్రి లోకేశ్ ప్రచార షెడ్యూల్ ఉంది. కానీ సదరు మంత్రి మాత్రం మా జిల్లాలో ప్రచారానికి మొన్ననే సీఎం వచ్చి పోయారు కదా.. మీరు ఎందుకన్నా.. అంటూ సున్నితంగా తిరస్కరించారు. ఈ విషయం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. మచిలీపట్నం పోర్టును వాపసు తెలంగాణకు తీసుకుపోయేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారనే వ్యాఖ్యలు ఏపీలో దుమారం రేపాయి. కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటూ అన్నివర్గాలు చర్చించుకుంటున్నాయి. దీంతో ఇలా నేత‌లు అభ్యంత‌రం చెప్తున్న‌ట్లు స‌మాచారం. కాగా,  లోకేష్‌ను ఇతర ప్రాంతాల్లో ప్రచారానికి పంపవద్దని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వర్గాలే చెప్తున్నాయి. మంగళగిరిలో జాగ్రత్తగా చూసుకో అంటూ లోకేష్‌కు చెప్పినట్టు సమాచారం. దీంతో మంత్రి లోకేష్‌ ఇటీవల చేయాల్సిన పలు జిల్లాల పర్యటనలు రద్దు చేసినట్టు చెప్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: