ఎన్నికల రూపు రేఖలు  ఏ ఏటికి ఆ ఏడు బాగా మారిపోతున్నాయి. అటు నేతలు, ఇటు ప్రజలు కూడా ముదిరిపోతున్నారు. గతంలో నోటి మాట చెబితే చాలు జనం నమ్మేసేవారు. ఇక నాయకులైతే బుజ్జగిస్తే దారికి వచ్చేసేవారు. అయితే ఇపుడు అలాంటి పరిస్థితి ఎక్కడా లేదు. హామీలకు కూడా ఆధారాలు కావాలని గట్టిగా అడుగుతున్నారు. నోటి మాట వద్దు నోటు రాత కావాలంటున్నారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఓ వైసీపీ నేత ఇలాంటి డిమాండ్ పెట్టి మరీ పార్టీలో కొనసాగుతున్నారు. ఇక్కడ 2014 ఎన్నికలో పోటీ చేసి తక్కువ ఓట్లతో ఓటమి పాలైన జమ్మాన ప్రసన్నకుమార్ ని పార్టీ ఈసారి పక్కన పెట్టింది. ఆయన స్థానంలో కాంగ్రెస్ కి చెందిన నాయకుడు అలజంగి జోగారావుకు టికెట్ ఇచ్చింది. దాంతో మండిపోయిన ప్రసన్నకుమార్ ఏకంగా టీడీపీలోకి ఫిరాయించాలనుకున్నాడు.


దాంతో విషయం తెల్సిన కంగారు పడిన వైసీపీ హై కమాండ్ ప్రసన్నకుమార్ తో రాయబేరాలు నడిపింది. ఆయన కనుక పార్టీ మారితే ఘర‌మైన పరాజయం చవిచూస్తామని లెక్కలేసుకుని మరీ దారికి తేవాలనుకుంది. సరిగ్గా ఇక్కడ ప్రసన్నకుమార్ తన తెలివిని ఉపయోగించారు. ఓ వైపు జనసేన, మరో వైపు టీడీపీ నుంచి తనకు పిలుపు ఉందని చెబుతూ ఏకంగా చెట్టెక్కేశాడు. దాంతో తల పట్టుకున్న హై కమాండ్ పెద్దలు ఏం కావాలో కోరుకోమన్నారు. అపుడు తన కోరికల చిట్టా ప్రసన్న కుమార్ బయటపెట్టారట.


తాను వైసీపీలో కొనసాగాలన్నా, పార్టీ విజయానికి సహకరించాలన్న తనకు పార్టీ అధికారంలోకి వస్తే నామినేటెడ్ పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారట. అది ఎమ్మెల్సీ లాంటి పదవి అని కూడా కండిషన్ పెట్టాడట. ఆ పదవి ఇస్తేనే ఉంటానని చెప్పారట. ఓకే అలాగే అంటే కుదరదు వెంటనే వంద రూపాయల స్టాంప్ పేపర్ పై రాసి సంతకాలు చేయాలని కోరారట. దాంతో చేసేది లేక పార్టీ పెద్దలు అదే పని చేసి నోటు కాగితాలను ఆయన చేతిలో పెట్టారట. విషయం తెలుసుకున్న పార్టీలోని వారితో పాటు మిగిలిన పార్టీలో అసమ్మతి నేతలు అమ్మో ప్రసన్నా  అంటున్నారుట. ఇపుడు ఈ వ్యవహారం బయట‌కు పొక్కడంతో  మిగిలిన వారు సైతం ఇదే నోటు మాట పాట పాడుతున్నారట. ఇదే మరి పాలిటిక్స్ లో నయా ట్రెండ్ అంటేనేమో.



మరింత సమాచారం తెలుసుకోండి: