ప్రముఖ ఇంగ్లీషు దినపత్రిక ’ది ఎకనమిక్ టైమ్స్’ చంద్రబాబునాయుడుపై సంచలన కథనం ప్రచురించింది. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు ఓటమి తప్పదని తేల్చేసింది. అందుకు తన కోణంలో కొన్ని పాయింట్లను కూడా ఉదహరించింది. అంటే విశ్లేషణ ప్రకారం చూస్తే సదరు పత్రిక చెప్పిన ఉదాహరణలు చూస్తే జగన్మోహన్ రెడ్డే అధికారంలోకి వస్తున్నారని అర్ధమైపోతోంది.

  

కీలక సమయాల్లో తప్పులు చేయటం చంద్రబాబుకు బాగా అవాటుగా విశ్లేషణలో  పేర్కొంది.  రాజకీయంగా పొరబాట్లు చేయటం చంద్రబాబుకు బాగా అలవాటని చెప్పింది. 2004లో ముందస్తు ఎన్నికలకు పోవటం చంద్రబాబు చేసిన అతిపెద్ద పొరబాటుగా గుర్తుచేసింది. మావోయిస్టుల దాడి తర్వాత లేని సింపతీని ఉందనుకుని చంద్రబాబు ముందస్తు ఎన్నికలకు వెళ్ళి దారుణంగా దెబ్బతిన్నట్లు చెప్పింది.

 

పదేళ్ళు ప్రతిపక్షంలో కూర్చున్న తర్వాత రాష్ట్ర విభజన నేపధ్యంలో జరిగిన ఎన్నికల్లో మోడి, పవన్ మద్దతు వల్ల జగన్ పై స్వల్ప మెజారిటీతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. ఇక ప్రస్తుత విషయానికి వస్తే పవన్ కల్యాణ విషయంలో కూడా చంద్రబాబుది రాంగ్ స్ట్రాటజీగా పేర్కొంది. పవన్ తో విడిగా పోటీ చేయిస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోతుందనేది చంద్రబాబు ఆలోచనట. కానీ వాస్తవంగా అలా జరగదని పత్రిక చెప్పింది.

 

నరేంద్రమోడి పై యాంటీ వేవ్ ఉందన్న చంద్రబాబు భ్రమ కూడా తప్పే అని చెప్పింది. చంద్రబాబు అనుకున్నంత స్ధాయిలో మోడిపై జనాల్లో వ్యతిరేకత లేదని తేల్చేసింది.  అలాగే ప్రతీరోజు కెసియార్ , మోడిలను తిడితే జనాలు టిడిపికి ఓట్లేస్తారని అనుకోవటం కూడా రాంగ్ స్ట్రాటజీనే అని విశ్లేషించింది. ఐదేళ్ళ పాలనా వైఫల్యాల వల్లే చంద్రబాబుకు ఎదురుదెబ్బ తగలబోతోందంటూ పత్రిక చెప్పింది.

 

క్యాస్ట్, కరప్షన్, క్రైమ్ అనే ప్రధాన అంశాల మీదే జనాలు ఓట్లేయబోతున్నట్లు పత్రిక అంచనా వేసింది. కెసియార్, మోడిలతో జగన్ జతకట్టాడు అనే నిరాధార ఆరోపణలు చేయటం వల్ల పెద్దగా ఉపయోగం లేదట. ఎందుకంటే, ముదస్తు ఎన్నికల్లో కెసియార్ విజయం సాధించారు. రేపు మోడి కూడా మళ్ళీ అధికారంలోకి రాబోతున్నారు. కాబట్టి వారితో జగన్మోహన్ రెడ్డిని పోల్చటం వల్ల ఏపిలో అధికారంలోకి రాబోయేది జగనే అని స్వయంగా చంద్రబాబు అంగీకరిస్తున్నట్లుంది అంటూ విశ్లేషించింది.  

 


మరింత సమాచారం తెలుసుకోండి: