నందికొట్కూరు వైసీపీ అభ్యర్థి సిద్దార్ధ్ బైరెడ్డి ఎమ్మెల్యేగా ఆ పార్టీ తరుపున నుంచి భరిలోకి దిగుతున్నారు. అయితే నందికొట్కూరు భహిరంగ సభలో బైరెడ్డి స్పీచ్ కు జనాల నుంచి విశేష స్పందన వచ్చింది. నిజంగా జగన్ మాట్లాడితే ఎలా అయితే ఈలలు , గోలలు రెస్పాన్స్ వస్తుందో అదే మాదిరిగా రావటం గమనార్హం. బైరెడ్డి మాట్లాడుతూ నందికొట్కూరు నుంచి వైసీపీ తరుపున నుంచి భరిలోకి దిగుతున్నానని, రాక్షస పాలన నుంచి మనల్ని కాపాడుకుందామని చెప్పాడు. 


ఇంకా మాట్లాడుతూ రాజన్న రాజ్యం కావాలంటే అన్న జగన్ ప్రభుత్వం రావాలని రాక్షసులను నుంచి నందికొట్కూరు ను కాపాడుకుందామని ఇక్కడ 20 ఏళ్ల నుంచి కొట్టుకుంటున్న నాయకులూ కలిసి పోయారని వారి నుంచి నేను నందికొట్కూరు ను కాపాడతానని చెప్పుకొచ్చాడు. నన్ను చాలా మంది పద్మ వ్యహం లో చిక్కుకుపోయిన అభిమన్యుడని అంటున్నారని కానీ నేను అభిమన్యుడును కాదని పద్మవ్యూహాన్ని ఛేదించే అర్జునుడిని చెప్పాడు. 


ఇంకా మాట్లాడుతూ భయపడి వెనుకడుగు వేసేది లేదని చివరి వరకు పోరాడతానని, వీర స్వర్గం పొందుతానని చెప్పాడు. తరువాత జగన్ మాట్లాడుతూ యువకుడైన, సౌమ్యుడైన బైరెడ్డిని గెలిపించాలని తనను రాజకీయంగా ఇంకా ఎదిగే విధంగా చేస్తానని పిలుపునిచ్చాడు. అయితే నందికొట్కూరు లో వైసీపీ విజయం ఖాయమని తెలుస్తుంది. టీడీపీకి పరాజయం తప్పదని అక్కడ స్థానికులు చెబుతున్నారు. 

video link: 

https://www.youtube.com/watch?v=BLuuBxqvnUg&feature=youtu.be

మరింత సమాచారం తెలుసుకోండి: