ఏపీలో ఎన్నికల హోరు మామూలుగా లేదు. ఓ వైపు యువతరంగలా, పట్టువదలని విక్రమార్కునిగా జగన్ బరిలో ఉన్నారు. మరో వైపు అనేక యుద్ధాల్లో ఆరితేరిన చంద్రబాబు ఉన్నారు. అటు అనుభవం, ఇటు ఆధునాతనం రెండూ కావాల్సినవే. రెండూ ఉండాల్సినవే. అయితే యుద్ధంలో ఒకరే విజేత. మరి ఆ విధంగా చూసినపుడు పరాజితుని పరిస్థితి ఏంటి...



టీడీపీకి ఇవే ఆఖరు ఎన్నికలు అంటున్నారు జగన్ సోదరి షర్మిల. గుంటూర్లో ఆమె రోడ్ షోలలో తమ స్పీచ్ తో అదరగొట్టేస్తున్నారు. సూటిగా సుత్తి లేకుండా చెప్పదలచుకున్న విషయాలను ఆమె జనంలోకి పంపుతున్నారు. టీడీపీ కి ఒక్క అవకాశం ఇస్తే చేజేతులా జారవిడుచుకుంది ఇక ఆ పార్టీకి ఓటేయవద్దు, అసలే నమ్మవద్దు అంటున్నారు షర్మిల. జగన్ మాట తప్పడని, ఆయనకు ఒక్కసారి చాన్స్ ఇవ్వాలని కోరుకున్నారు.   ఏపీని అభివ్రుధ్ధి చేసే బాద్యత తమది అంటున్నారు. బాబుకు, టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు అంటూ షర్మిల గట్టిగానే చెబుతున్నారు.


అదే విధంగా వైసీపీలో ఇటీవల చేరిన సినీ నటుడు మోహన్ బాబు కూడా మీడియా సమావేశంలో బాబుపై నిప్పులు చిరిగారు. బాబు గారి టీడీపీ ఫినిష్ అనేశారు. ఇక కనిపించదు  ఆ పార్టీ అని కూడా శాపనార్ధాలు పెట్టారు. మరో వైపు టీడీపీ వాళ్ళు ఈ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం ఖాయమని క్లారిటీగా చెప్పేస్తున్నారు. ఆ తరువాత జగన్ రాజకీయాల్లో ఉండరని, వైసీపీ మూతపడుతుందని కూడా అంటున్నారు. అయితే ఇక్కడో విషయం అంతా మరచిపోతున్నారు. జగన్ పార్టీ తొలిసారి పోటీ చేసిన ఎన్నికల్లో ఓడిపోయింది. అయినా ఎన్ని అడ్డంకులు  వచ్చినా కూడా ఆయన అయిదేళ్ళ పాటు పార్టీని కాపాడుకున్నారు.


మళ్ళీ బాబుతో ఢీ కొట్టారు. సో అందువల్ల వైసీపీకి ఏం కాదన్నది ఇక్కడ తేలిపోతోంది. అలాగే టీడీపీ ఒకసారి ప్రతిపక్షంలో కూర్చున్నంత మాత్రాన ఆ పార్టీకి కూడా ఏం కాదు, అయితే బాబు వయస్సుని ద్రుష్టిలో పెట్టుకునపుడు, ఆ పార్టీలో లోకేష్ సహా మిగిలిన వారి సత్తా కూడా జనం చూసినపుడు మాత్రం ఈ రకమైన అంచనాలకు రావడం సహజం. మొత్తానికి ఇవి ఎన్నికలే కానీ ఎవరికీ చివరి ఎన్నికలు కావని గట్టిగా చెప్పవచ్చు


మరింత సమాచారం తెలుసుకోండి: