ఏపీ రాజకీయాలు మొదట అనుకున్నట్లుగా కనిపించడంలేదు రెండు బలమైన పార్టీల మధ్య పోరు భీకరంగా సాగుతోంది. జనసేన 2014 ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఈసారి ఎన్నికల్లో పవన్ పార్టీ రంగంలో ఉంది పవన్ ఇతర మిత్ర పక్షాలతో కలసి ఎన్నికల యుధ్ధానికి సై అంటున్నారు.


అయితే ఏపీలో ఈసారి త్రిముఖ పోరు అని మొదట అనుకున్న అంచనాలు చాలా వరకూ తప్పేలా కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీల బలమైన నాయకత్వాలు, పటిష్టమైన పార్టీ యంత్రాంగంతో పాటు, జనసేన అయోమయమైన రాజకీయ పోకడలు కూడా ప్రధాన కారణంగా చెప్పాలి. జనసేన అధినేత పవన్ చెప్పిన దానికి చేస్తున్న దానికీ పొంతల లేదన్న భావన బలపడుతోంది. తాను తప్ప తన వారు ఎవరూ రాజకీయాల్లో ఉండరన్న ఆయన తన అన్న నాగబాబుకు రాత్రికి రాత్రి ఎంపీ టికెట్ ఇచ్చేశారు.


ఇక లోకల్ అభ్యర్ధులే నిలబెడతానని చెప్పైన సేనాని విశాఖ లాంటి చోట్ల పెద్ద సంఖ్యలో ఇతర జిల్లాల వారిని దిగుమతి సరుకుని దింపేశారు. తానే స్వయంగా గాజువాకలో పోటీ చేస్తూ లోకల్ అభ్యర్హ్దులకు షాక్ తినిపించారు. ఇక అనకాపల్లి నుంచి మంత్రి గంటా శ్రీనివాసరావు బంధువుకు టికెట్ ఇవ్వడం ద్వారా అవినీతి ఆరోపణలు ఉన్న వారికి ఆస్కారం కల్పించారు. పైగా టీడీపీతో దోస్తీ ఉందన్న ప్రచారానికి కూడా  ఊతమిచ్చారు


ఇవన్నీ ఇలా ఉంచితే పవన్ ప్రచారం  గత పది రోజులుగా సాగుతోంది. ఆయన ఎంచుకున్న అంశాలు, అజెండా కూడా ఆయన పార్టీని జనాలకు బలమైన  పోటీ ఇచ్చే స్థాయికి తీసుకెళ్ళలేకపోతునాయి. పవన్ ఎంతసేపూ జగన్ని మాత్రమే తిడుతున్నారు. ఏపీలో అధికారంలో ఉంది అచ్చంగా టీడీపీ, మరి పవన్ అధికారంలోకి రావాలనుకున్నపుడు టీడీపీపై గట్టిగా గొంతు ఎత్తాల్సి ఉంది. సుతిమెత్తగా మొక్కుబడిగా విమర్శలు చేస్తే జనం చూపు వైసీపీ మీదకే పోతుంది. సంస్థాగతంగా లోపాలు కూడా ఆ పార్టీకి శాపాలుగా మారాయి. మొత్తానికి చూస్తే ఏపీ ఎన్నికల్లో జనసేన ఏ మేరకు ప్రభావం చూపిస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: