పవన్ కళ్యాణ్ మేనిఫెస్టో ముందు జగన్ ... చంద్రబాబు ఇద్దరు పనికిరారని చెప్పాలి. జగన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు 9 అంశాలపై హామీలిస్తే.. పవన్ కల్యాణ్ తాను పోటీచేస్తున్న ఒక్క నియోజకవర్గానికే ఏకంగా 64 అంశాలపై హామీ ఇచ్చి రికార్డ్ సృష్టించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉండే సమస్యలతో పాటు.. ఏ నియోజకవర్గంలో అయినా స్థానికంగా మరికొన్ని ప్రధాన సమస్యలుంటాయి. మహా అయితే 5 లేదా 10 అంశాలు ఎన్నికల వేళ ప్రచారాస్త్రాలుగా పనికొస్తాయి.


అయితే పవన్ కల్యాణ్ కి మాత్రం తనకు తోచిన 64అంశాలను ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. ఈ మేనిఫెస్టో బుక్ లెట్ చూసిన తర్వాత నియోజకవర్గ ప్రజలే అసలు ఇన్ని సమస్యలు మాకున్నాయా అంటూ నోరెళ్లబెడుతున్నారు. అగనంపూడిని రెవెన్యూ డివిజన్ చేయడంతో సహా, గాజువాకలో ఇంటిపన్ను తగ్గించడం, తోపుడు బండ్ల వ్యాపారులకు పూర్తిగా పన్ను మినహాయింపు ఇవ్వడం, నైట్ షెల్టర్లు, తక్కువ వడ్డీకే రుణాలు.. ఇలా 64అంశాలు ఇందులో ఉన్నాయి.


కేవలం గాజువాకలో పవన్ గెలిస్తే ఈ హామీలన్నీ నెరవేరవు. రాష్ట్రంలో జనసేన అధికారంలోకి వస్తేనే వీటికి మోక్షం వస్తుంది. పోటీచేసేది అసెంబ్లీకి, ఇచ్చే హామీలు ముఖ్యమంత్రి స్థాయిలో.. ఇదీ పవన్ కల్యాణ్ మేనిఫెస్టో ప్రహసనం. అందుకే పవన్ మేనిఫెస్టోని చూసి గాజువాక జనం నవ్వుకుంటున్నారు. ఇప్పటి వరకూ ఏ నేతలూ ఇవ్వని, ఇవ్వలేని హామీలను గుప్పిస్తున్న పవన్ కల్యాణ్ వాటిని అమలు చేయడంలో సాధ్యాసాధ్యాలను మాత్రం లెక్కలోకి తీసుకోవడంలేదు. మొత్తమ్మీద హామీలు ఇవ్వడంలో పవన్ రికార్డు సృష్టించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: