ఆంధ్ర లోనే కాదు దేశం మొత్తం మీద జగన్ పార్టీ ప్రభంజనం ఖాయమని తెలుస్తుంది. ఇప్పటికే పలు సర్వేలు అదే విషయాన్ని చెబుతున్నాయి. అయితే 25 ఎంపీ సీట్లు కలిగిన ఏపీలో విపక్షంగా ఉన్న వైసీపీ... దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల్లో పురుడుపోసుకుంది. ఇటీవలే తొమ్మిదో వసంతం పూర్తి చేసుకున్న ఈ పార్టీ ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో విన్నర్గా నిలిచే అవకాశాలున్నట్లు ఇప్పటికే పెద్ద ఎత్తున విశ్లేషణలు వినిపిస్తున్నాయి.


ఏపీ అసెంబ్లీలో స్పష్టమైన మెజారిటీతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నదని భావిస్తున్న వైసీపీ... 25 అసెంబ్లీ సీట్లలో 20కి పైగా సీట్లలో విజయకేతనం ఎగురవేయనుందని తెలుస్తోంది. ఇప్పటిదాకా విడుదలైన దాదాపుగా అన్ని సర్వేలు ఇదే మాటను చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి విడుదలైన మరో సర్వే కూడా ఇదే విషయాన్ని చెప్పింది. వీడీపీ అసోసియేట్స్ అనే సంస్థ నిర్వహించిన ఈ సర్వేలో వైసీపీ ఏకంగా 20కి పైగా ఎంపీ సీట్లను గెలుచుకుంటుందని తేలింది. అంతేకాదండోయ్... ఇక్కడ మరో ఆసక్తికర అంశం కూడా ఉంది. 


దేశంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీల జాబితాను తనదైన అంచనా మేరకు విడుదల చేసిన వీడీపీ అసోసియేట్స్... వైసీపీని థర్డ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీల జాబితాలో చేర్చింది. ఈ జాబితాలో వైసీపీతో పాటు తృణమూల్ కాంగ్రెస్ పార్టీతో పాటు సమాజ్ వాదీ పార్టీ కూడా ఉన్నాయి. ఏపీలో అధికార పార్టీగా ఉన్న టీడీపీ గానీ తెలంగాణలో అధికార పార్టీగా ఉన్న టీఆర్ఎస్ గానీ ఈ జాబితాలో చోటు దక్కించుకోలేకపోయాయి. టీడీపీ పరిస్థితి మరింత దారుణంగా ఉండగా.... 17 ఎంపీ సీట్లు ఉన్న తెలంగాణలోని అధికార పార్టీగా ఉన్న టీఆర్ఎస్ ఫోర్త్ సింగిల్ లార్జెస్ట్ పార్టీల జాబితాలో చోటు దక్కించుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: