షర్మిల ఉంగరాన్ని కొంతమంది లాగటానికి ప్రయత్నించడం .. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆమె ప్ర‌చారంలో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి బస్సు యాత్ర ప్రారంభించిన విష‌యం తెలిసిందే.  రోడ్‌షోలో భాగంగా శనివారం స్థానికులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఇదే సమయంలో పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు షర్మిలకు షేక్ హ్యాండ్ ఇవ్వ‌డానికి ఎగ‌బ‌డ్డారు.


దీంతో ఆమె క‌దులుతున్న బ‌స్‌లోంచే అంద‌రికీ షేక్ హ్యాండ్ ఇస్తూ ముందుకు సాగుతుండ‌గా... ఓ వ్య‌క్తి ఆమె చేతికున్న ఉంగ‌రాన్ని లాగే ప్ర‌య‌త్నం చేశారు. అంత మంది వైసీపీ అభిమానుల మ‌ధ్య అత‌ను ఆ సాహ‌సానికి తెగ‌బ‌డ‌టం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. ఉంగ‌రం లాగేసుకోవ‌డానికి అత‌ను చేసిన ప్ర‌య‌త్నం విఫ‌ల‌మైన‌ట్టు తెలుస్తోంది. వీడియోలో మాత్రం దొంగ‌త‌నం జ‌రిగిన‌ట్టు క‌నిపిస్తున్నా పార్టీ వ‌ర్గాలు మాత్రం ఉంగరం గ‌ట్టిగా ఉండ‌టం వ‌ల్ల రాలేద‌ని చెబుతున్నాయి.


ఈ ఘ‌ట‌న ఇంట‌ర్నెట్‌లో బీభ‌త్సంగా వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోకు నెటిజ‌న్లు ర‌క‌ర‌కాల కామెంట్లు చేస్తున్నారు. ఈ వైర‌ల్ వీడియోపై న‌డుస్తున్న‌ డిస్క‌ష‌న్లు, పేలుతున్న సెటైర్లు పుష్క‌లంగా కామెడీని పండిస్తున్నాయి. పాపం... దీనిమీద ఎలా స్పందించాలో తెలియ‌క పార్టీ వ‌ర్గాలు మౌనంగా ఉన్నాయి. మొత్తానికి లైవ్ లో కూడా ఇలా నాయకుల ఉంగరాన్ని కొట్టేయాలనుకోవటం ఆశ్చర్యాన్ని కలిగించేదే. 

మరింత సమాచారం తెలుసుకోండి: