పుత్రరత్నం నారా లోకేష్ ను ఎలాగైనా గెలిపించాలన్న ఏకైక లక్ష్యంతో నంద్యాల స్కెచ్ అమలుకు చంద్రబాబునాయుడు ప్లాన్ చేసినట్లు సమాచారం. నంద్యాల ఉపఎన్నికల్లో టిడిపి గెలుపుకు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు చెందిన నేతలకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఓటర్లను గుర్తించటం, డబ్బులు పంపిణీ బాధ్యతలు అప్పగించటం, ఓటర్లను మొబలైజ్ చేయటం, ఓటర్లు టిడిపికి ఓట్లు వేసింది లేనిది సరిచూసుకోవటం లాంటివి ఎప్పటికప్పుడు మానిటర్ చేశారు.

 

ముందుగా డబ్బులు పంపిణీ చేసే విధానం ఒక పద్దతైతే ఓటు వేసిన తర్వాత డబ్బులు అందేట్లు చూసుకోవటం రెండో పద్దతి. అందుకనే నంద్యాలను క్లస్టర్లు, సెక్టార్లుగా విభజించి నియోజవర్గం మొత్తం మీద సుమారు 300 మంది నేతలకు బాధ్యతలు అప్పగించారు. ఈ 300 మందికి స్ధానిక నేతలను సమన్వయం చేసుకునే బాధ్యతను అప్పగించారు. అంటే ఓటర్లకు డబ్బులు ఎంత పంచాలి ? ఎవరెవరికి పంచాలి ? అనే బాధ్యతలను 300 మంది నేతలే చూసుకునే వారు. సరే మొత్తం మీద నంద్యాల ఉపఎన్నికను అందరి అంచనాలకు భిన్నంగా గెలుచుకున్నది.

 

ఇపుడు మంగళగిరిలో కూడా నంద్యాల ఫార్మూలానే అమలు చేయాలని చంద్రబాబు నిర్ణయించారట. ఎలాగూ అధికారంలో ఉన్నారు, అందులోను పుత్రరత్నం కదా కాబట్టి డబ్బుల పంపిణీకి లెక్కే ఉండదనుకోండి. ఇక్కడ సమస్యేమిటంటే, లోకేష్ మీద వైసిపి అభ్యర్ధి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గెలవటం పెద్ద విషయం కాదు. ఎందుకంటే బాధితుల తరపున ఆళ్ళ నిజమైన ప్రజా ప్రతినిధిగా పనిచేశారు.

 

అదే టిడిపి కోణంలో చూస్తే లోకేష్ ఓడిపోతే మాత్రం పరువుపోతుంది. కొడుకునే గెలిపించుకోలేకపోయాడనే విమర్శలను ఎదుర్కోవాల్సొస్తుంది. నిజానికి చంద్రబాబు కొడుకన్న అర్హత తప్ప లోకేష్ కు ఎంఎల్సీ అవటానికి మంత్రవ్వటానికి మరో అర్హతే లేదని  టిడిపి నేతలే అంటుంటారు. కాబట్టి లోకేష్ గెలుపు చంద్రబాబుకు అత్యంత ప్రతిష్టాత్మకం. అందుకే మంగళగిరిలో కూడా నంద్యాల ఫార్ములానే అమలు చేయాలని నిర్ణయించారట. మరి జనాలు ఏం చేస్తారో చూడాల్సిందే.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: